పెళ్లి చేసుకుంటే ఆయుష్షు నిజంగా పెరుగుతుందా..!

పెళ్లి చేసుకుంటే ఆయుష్షు నిజంగా పెరుగుతుందా..!
x
Highlights

ఎందుకే రమణమ్మ పెళ్లేందుకే రమణమ్మ.. అంటూ ఓ సీని గేయ రచయిత చెప్పినట్టు.. చాల మంది యువత పెళ్లికి సమయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం యూత్ సెటిల్ అయ్యేంత వరకు...

ఎందుకే రమణమ్మ పెళ్లేందుకే రమణమ్మ.. అంటూ ఓ సీని గేయ రచయిత చెప్పినట్టు.. చాల మంది యువత పెళ్లికి సమయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం యూత్ సెటిల్ అయ్యేంత వరకు పెళ్లికి నో చెబుతున్నారు. అయితే పెళ్లి చేసుకోవటం వల్ల గొప్ప ప్రయోజనం కల్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇంతకీ పెళ్లి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటా అని ఆలోచిస్తున్నారా..! ఆయుష్షు.. అవును.. పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందంట. గుండెకు సంబంధించిన రోగాలు రావట. ఒంటరిగా ఉంటున్న వాళ్లతో పోల్చితే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవ‌కాశం ఉంద‌ంటున్నారు. ఆరోగ్యక‌రంగా జీవించేందుకు పెళ్లి ఓ చక్కని మార్గమని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ విష‌యంపై బ్రిట‌న్‌లో 10 లక్షల మందిపై అధ్యయనం జరిగింది. వారంతా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే. ముఖ్యంగా వారికి రక్తపోటు.. డ‌యాబెటిస్ వంటి సమస్యలు ఉన్నాయి. వీళ్లలో ఒంట‌రిగా ఉంటున్న వారికంటే పెళ్లైన వారు ఎక్కువ సంతోషంగా గడుపుతున్నట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన వారిలోనూ.. వివాహితులు తొందరగా కోలుకుంటున్నారని తేలింది.

ముఖ్యంగా గుండెపోటుకు దారితీసే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణకు పెళ్లి మంచి మందులా ప‌నిచేస్తుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 50 నుంచి 70 ఏళ్ల వ‌య‌సున్న వారిని ప‌రిశీలిస్తే.. పెళ్లి కాని వారి కంటే పెళ్లైన వారు 16శాతం ఎక్కువ కాలం బతుకుతున్నార‌ని ఈ అధ్యయనంలో తేలింది. పెళ్లితో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్‌, సామాజిక బంధుత్వాలు కూడా ఆరోగ్యంగా జీవించేందుకు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories