Eye Care Tips: పిల్లల్లో కంటిచూపు తగ్గుతుందా.. ఈ కూరగాయలు తినిపించండి..!

Does Eyesight Decrease in Children Feed These Vegetables
x

Eye Care Tips: పిల్లల్లో కంటిచూపు తగ్గుతుందా.. ఈ కూరగాయలు తినిపించండి..!

Highlights

Eye Care Tips: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టవచ్చు. కానీ దీని కారణంగా పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీలకు అలవాటుపడిపోయారు.

Eye Care Tips: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టవచ్చు. కానీ దీని కారణంగా పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీలకు అలవాటుపడిపోయారు. దీంతో వారికి చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తోంది. కళ్లు మసకగా కనబడకూడదంటే పిల్లలు మొబైల్-టీవీకి కొంత దూరంగా ఉండాలి. అంతేకాదు వారికి కంటిచూపుని పెంచే ఆహారం అందించాలి. చలికాలంలో ఈ కూరగాయలు తింటే కంటిచూపు మెరుగవుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

పాలకూర

కంటి చూపును పెంచడానికి పాలకూర మంచి ఆహారంగా చెప్పవచ్చు. ఇందులో పెద్ద మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. సాధారణంగా పిల్లలు పాలకూర, బచ్చలికూర తినడానికి ఇష్టపడరు. ఈ పరిస్థితిలో పప్పులలో లేదా సూప్‌ తయారుచేసి తినిపించడం తాగిపించడం చేయాలి. దీనివల్ల వారి కంటి చూపు మెరుగవుతుంది.

చిలగడదుంప

కంటి సంరక్షణ కోసం చిలగడదుంపలు తినాలి. శీతాకాలంలో ప్రతిచోటా సులభంగా లభిస్తాయి. వీటిలో లుటిన్, విటమిన్-ఎ, సి ఉంటాయి. వీటి రెగ్యులర్ వినియోగం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అందుకే చలికాలంలో క్రమం తప్పకుండా పిల్లలకి తినిపించాలి.

క్యారెట్లు

క్యారెట్ శీతాకాలంలో లభించే ఉత్తమ ఆహారం. ఇందులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు, ల్యూటిన్, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కావాలంటే క్యారెట్‌లను సలాడ్ రూపంలో తినిపించవచ్చు లేదా జ్యూస్ రూపంలో పిల్లలకు ఇవ్వవచ్చు. క్యారెట్ తినడం వల్ల కళ్ల కండరాలు బలపడి మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

క్యాప్సికమ్‌

క్యాప్సికమ్ కంటి చూపుకు దివ్యౌషధంగా చెబుతారు. ఇందులో ఉండే గ్రీన్ యాంటీ ఆక్సిడెంట్లు కంటి కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే విటమిన్-సి కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది. అందుకే పిల్లలకు క్యాప్సికమ్‌ను వెజిటబుల్ లేదా సలాడ్ రూపంలో తినిపించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories