Health Tips: దగ్గు ఉన్నప్పుడు గుడ్డు తినొచ్చా? తింటే తగ్గుతుందా.. పెరుగుతుందా?

Health Tips: దగ్గు ఉన్నప్పుడు గుడ్డు తినొచ్చా? తింటే తగ్గుతుందా.. పెరుగుతుందా?
x

Health Tips: దగ్గు ఉన్నప్పుడు గుడ్డు తినొచ్చా? తింటే తగ్గుతుందా.. పెరుగుతుందా?

Highlights

ఆరోగ్యానికి గుడ్డు ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు.

Health Tips: ఆరోగ్యానికి గుడ్డు ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది.. దగ్గు, జలుబు ఉన్నప్పుడు గుడ్డు తినవచ్చా? తింటే దగ్గు తగ్గుతుందా లేక పెరుగుతుందా? ఈ విషయంలో ఉన్న ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

గుడ్డు నేరుగా దగ్గును తగ్గించే మందులా పనిచేయకపోయినా, పరోక్షంగా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్డులో ఉండే అధిక ప్రోటీన్లు, విటమిన్ డి, బి12 శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని ఇవి పెంచుతాయి. శరీరం బలంగా ఉంటేనే జలుబు, దగ్గు కలిగించే వైరస్‌లపై సమర్థవంతంగా పోరాడగలదు. కాబట్టి దగ్గు ఉన్నప్పుడు గుడ్డు తినడం సురక్షితం మాత్రమే కాదు, ఆరోగ్యకరం కూడా.

గుడ్డు తెల్లసొనలో స్వచ్ఛమైన ప్రోటీన్, నీటి శాతం ఉంటుంది. ఇది శరీర కణాల మరమ్మత్తుకు ఉపయోగపడుతుంది. ఇక పచ్చసొనలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. శీతాకాలంలో లేదా వర్షాకాలంలో వచ్చే సాధారణ జలుబు, దగ్గుల నుంచి శరీరం త్వరగా కోలుకోవడానికి గుడ్డులోని పోషకాలు ఇంధనంలా పనిచేస్తాయి. అందుకే నీరసంగా ఉన్నప్పుడు వైద్యులు గుడ్డు తినమని సలహా ఇస్తుంటారు.

దగ్గు ఉన్నప్పుడు కేవలం గుడ్డు తినడమే కాకుండా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గొంతు పొడిబారకుండా ఉండటానికి తరచుగా గోరువెచ్చని నీరు తాగాలి. గుడ్డుతో పాటు పసుపు వేసిన పాలు, తేనె, అల్లం లేదా తులసి రసం వంటివి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. అయితే దగ్గుతో పాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన లక్షణాలు ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories