ఆ కప్ప మహిళలకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తుంది!

ఆ కప్ప మహిళలకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తుంది!
x
Highlights

కప్ప మహిళలకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడమేంటి? మరి వింత కాకపోతే అనుకుంటున్నారా..! అవును ఇది నిజంగా వింతే.. కప్ప ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తుంది. సబ్- సహరన్...

కప్ప మహిళలకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడమేంటి? మరి వింత కాకపోతే అనుకుంటున్నారా..! అవును ఇది నిజంగా వింతే.. కప్ప ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తుంది. సబ్- సహరన్ ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే జెనపస్ అనే కప్పకు ఆ విశిష్టత ఉంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ఈ కప్పును కొందరు వినియోగించటం విశేషం.

మహిళల మూత్రాన్ని ఆడ కప్ప చర్మంలోకి ఎక్కిస్తారు. ఆ తర్వాత కప్ప గుడ్లు పెడితే ఆ మహిళ గర్భం దాల్చినట్లుగా అక్కడ భావిస్తారు. 1930 నుంచి 1970ల మధ్య ప్రెగ్నెన్సీ నిర్ధారణ కోసం ఈ పరీక్షలపైనే ఎక్కువగా ఆధారపడేవారు.

మహిళ నుంచి సేకరించిన తాజా మూత్రాన్ని ఆడ కప్ప చర్మంలోకి ఎక్కించేవారు. తరువాత వారు కొద్దిసేపు వేచిచూసేవారు. ఆ మహిళ గర్భం దాలిస్తే.. కప్ప 5 నుంచి 12 గుడ్లు పెడుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం 1990ల్లో చాల ఆధునిక పరీక్షా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అనేక రకాల పరికరాలు, పరీక్షా విధానాలు అందుబాటులోకి రావటంతో.. ఆ కప్పలపై పరీక్షలు తగ్గిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories