ఆ చెట్టు నడుస్తుందట!

ఆ చెట్టు నడుస్తుందట!
x
Highlights

నడిచే చెట్టు గురించి ఎప్పుడైనా విన్నారా.. ఎక్కడైనా చదివారా.. నడిచే చెట్టు అసలు ఉందా అని అనుమానం కల్గుతుంది కదా..! చెట్టు ఎంటీ నడవడం ఎంటీ.. ఇదేక్కడి...

నడిచే చెట్టు గురించి ఎప్పుడైనా విన్నారా.. ఎక్కడైనా చదివారా.. నడిచే చెట్టు అసలు ఉందా అని అనుమానం కల్గుతుంది కదా..! చెట్టు ఎంటీ నడవడం ఎంటీ.. ఇదేక్కడి విడ్డూరం అని ఆశ్చర్యపోకండి. నిజంగా చెట్టు నడుస్తుంది. ఆ చెట్టును ఓ చోట నాటారనుకోండి. మనలాగే ఆ చెట్టుకూడ నడిస్తుంది. ఆ చెట్టు పేరే సొక్రాటియా ఎక్సోర్హిజా. ఎక్సో అంటే అవుట్‌, ర్హిజా అంటే రూట్స్‌.. బయటకు కనిపించే వేర్ల వల్లే చెట్టుకు ఆ పేరు వచ్చింది.

ఆ చెట్టును ఓ చోట నాటి.. కొన్నాళ్ల తరువాత చూస్తే ఆ చెట్టు అక్కడుండదు. కొంచెం ముందుకో, వెనక్కో, పక్కకో జరిగిపోతుంది. దీనివల్ల ఆ చెట్టును.. వాకింగ్‌ పామ్‌ అనీ కూడా పిలుస్తారు. ఈ వాకింగ్‌ పామ్‌.. దక్షిణ అమెరికా, బొలివియా, బ్రెజిల్‌, కొలంబియా, పెరూల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వాకింగ్ పామ్ 82 అడుగుల ఎత్తు వరకు పెరిగేస్తుంది. పొడవైన ఆకులతో గమ్మత్తుగా ఉండే ఆ చెట్టుకు పసుపు రంగు పూలు పూస్తాయి.

వాకింగ్‌ పామ్‌ నడవటానికి కారణం.. దాని వేర్లు. ఈ చెట్టు ఆకులు సూర్య కాంతిలో పెరిగుతాయి. దట్టమైన అడవుల్లో సూర్యరశ్మి తక్కువగా పడుతుంది. ఆ సమయంలో చెట్టు వేర్లతో నెమ్మదిగా నడిచేస్తుంది. చెట్టు కాండం కింద పొడవైన వేర్లు ఉంటాయి. చూడ్డానికి ట్రైపాడ్‌లా ఉంటాయవి. ఇవే చెట్టు కదిలేలా చేస్తాయి. బయటకు ఉన్న వేర్లు కొంచెం పక్కకి నాటుకుంటాయి. అవి పాతుకున్నాక ఇదివరకటి వేర్లను క్రమంగా వదిలించేసుకుంటాయి. మళ్లీ కొత్తవి నాటుకుంటాయి. ఆ తర్వాత పాతవేర్లను వదిలేస్తాయి. ఇలా కొంచెం కొంచెంగా ముందుకో.. పక్కకో కదిలేస్తుంది. ఇదంతా చాలా స్లోగా జరుగుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories