Top
logo

దాహంతో ఉన్న తాచుపాము నోటితో నీరు తాగుతుందా?

దాహంతో ఉన్న తాచుపాము నోటితో నీరు తాగుతుందా?
X
Highlights

దాహంతో ఉన్న ఓ తాచుపాముకు ఎవరో బాటిల్‌తో నీళ్లు పడుతున్న వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. ఈ...

దాహంతో ఉన్న ఓ తాచుపాముకు ఎవరో బాటిల్‌తో నీళ్లు పడుతున్న వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. ఈ వీడియోని చాలమంది షేర్లు కూడా చేశారు. అందుకు కారణం బాటిల్‌తో పాము నీరు తాగడం.. అది కూడా నోటితో.. అయితే ఇలా జరగడం అసాధ్యం అంటున్నారు నిపుణులు. పాములు సాధారణంగా నీటిని అలా తాగవట. పాములు ఎక్కువగా నీటిని తీసుకోవు అంటున్నారు. అరుదుగా మాత్రమే పాములు నీటిని తాగుతుంటాయి. అది కూడా

వాటి తల కింద భాగాన్ని నీటిలోకి తాకించడం వల్ల ఆ చర్మపు పొరల గుండా మాత్రమే లోపలికి వెళుతుంది. పాముల ఆహార వాహికలోకి క్యాపిల్లారిటీ అనే ధర్మం వల్ల నీరు ప్రవేశిస్తుందట. కప్పలు, ఎలుకలు, ఇతర ఆహార జీవుల్లో ఉండే నీటితోనే పాములు సర్దుకుపోతాయి.

అలాగే పాములు పాలు కూడ తాగవంటున్నారు నిపుణులు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆ వీడియోలోని పాము.. నిజంగా దాహంతో ఉన్నా కూడా నీరు తాగదట. ఎందుకంటే ఆ వీడియోలో పాము పడగ విప్పి ఉంది. పడగ విప్పి ఉన్నప్పుడు పాములు నీరు తాగలేవు. సో .. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి వీడియోల ద్వారా అపనమ్మకం వద్దంటున్నారు నిపుణులు.

Next Story