వేడి వేడిగా ఆహారం తినకూడదట..

వేడి వేడిగా ఆహారం తినకూడదట..
x
Highlights

చాలా మందికి వేడి వేడి ఆహారం తినే అలవాటు ఉంటుంది. ఫాస్ట్‌ఫుడ్‌ షాపులకు వెళ్తే..బిర్యానీ హోటల్‌కు వెళ్ళి వేడివేడిగా అహారం తీసుకునే అలవాటున్న వారు...

చాలా మందికి వేడి వేడి ఆహారం తినే అలవాటు ఉంటుంది. ఫాస్ట్‌ఫుడ్‌ షాపులకు వెళ్తే..బిర్యానీ హోటల్‌కు వెళ్ళి వేడివేడిగా అహారం తీసుకునే అలవాటున్న వారు చాలా మంది ఉన్నారు. మార్నింగ్‌ కాఫీ నుంచి రాత్రి తినే అన్నం వరకు వేడివేడిగా రుచిగా ఉండాలని అనుకుంటారు. హిట్‌గా ఉన్న ఆహరాన్ని లొట్టలేసుకుని తినేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇలా వేడివేడిగా ఆహార పదార్థా లను తీసుకోవడం మంచిదా? కాదా? దీనిపై నిపుణుల సలహాలు ఏమిటి?

వేడివేడిగా కాకుండా తక్కువ వేడితో ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వేడివేడిగా అన్నం తీసుకుంటే ఆహారాన్ని పేగు లోకి తీసుకెళ్లే మ్యూకోసాకు ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. వేడివేడిగా తీసుకునే ఆహారం ద్వారా మ్యూకోసా వ్యవస్థ దెబ్బతింటుందని, తద్వారా అల్సర్‌ వచ్చే ప్రమాదముందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరంభంలో దీనిని గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అదే క్యాన్సర్‌కు కారకమవుతుందని నిపుణులు అంటున్నారు. వేడివేడి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. కావున వేడివేడి అన్నం… వేడివేడి నీటిని తీసుకునేటప్పుడూ అవి మితంగా ఉండేలా చూసుకోవాలి. ప్లేటులోకి అన్నం కాస్త చల్లారిన తర్వాత తినడమే మంచిది. అలాగే కాఫీ కూడా వేడివేడిగా తీసుకోకూడదు. ఇందులోని కెఫిన్‌ జీర్ణక్రియను దెబ్బతీస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories