క్యాన్సర్ నుంచి ఫ్లూ వరకు దీని అవసరం ఎంతో ఉంది..

Discover the Benefits of Eating Turmeric in Winter
x

క్యాన్సర్ నుంచి ఫ్లూ వరకు దీని అవసరం ఎంతో ఉంది(ఫైల్ ఫోటో)

Highlights

* సనాతన ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్ల నుంచి పసుపుని వాడుతున్నారు. * భారతదేశంలో వంట వండాలంటే కచ్చితంగా పసుపు ఉండాల్సిందే.

Turmeric: పసుపులో ఎన్న ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. సనాతన ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్ల నుంచి పసుపుని వాడుతున్నారు. అంతేకాదు మాత్రల తయారీలో కూడా పసుపుని వినియోగిస్తున్నారు. భారతదేశంలో వంట వండాలంటే కచ్చితంగా పసుపు ఉండాల్సిందే. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా ఎన్నో రోగాలను నయం చేస్తుంది. పసుపు కర్కుమిన్ యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపు క్యాన్సర్, అల్జీమర్స్ రాకుండా నిరోధించవచ్చని శాస్త్రీయంగా నిరూపించారు. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

1. ఫ్లూ సీజన్

శీతాకాలంలో ఫ్లూ జ్వరాలు, జలుబు, దగ్గు ఎక్కువగా వస్తాయి. వాతావరణ మార్పుల వల్ల జరుగువచ్చు. లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నా ఈ సమస్యలు ఎదురవుతాయి. వీటికి పసుపు పాలు సహజ ఔషధం. చాలా మంది గర్భిణీ స్త్రీలు పసుపు పాలు తాగడం వల్ల మంచి ఉపశమనం కోరుకుంటారు. పసుపు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది.

2. టాక్సిన్స్‌ని తొలగిస్తుంది

మద్యం తాగే అలవాటు ఉన్నవారికి శరీరంలో టాక్సిన్స్‌ విపరీతంగా పేరుకుపోతాయి. వాటిని బయటికి పంపడానికి కాలేయం విపరీతంగా శ్రమిస్తుంది. ఇలాంటి సమయలో పసుపు పాలు కాలేయం పనితీరుని మెరుగు పరుస్తుంది. పసుపు అనేది యాంటీఆక్సిడెంట్ ఇది శరీరానికి లోపలి నుంచి ప్రయోజనం చేకూరుస్తుంది. పసుపు ఆహారం రుచిని పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. పసుపుతో కూడిన ఆహారాన్ని తినడం వల్ల చర్మం సహజంగా గ్లో సంతరించుకుంటుంది.

3. జలుబు, దగ్గు

పసుపు భూమిపై కనిపించే సహజ పదార్థం. సాధారణ జలుబు, సైనస్, కీళ్ళ నొప్పులు, అజీర్ణం, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పాలు, టీ వంటి పానీయాలలో చిటికెడు పసుపును కలుపుకొని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. పసుపును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. పసుపు రక్తాన్ని పలుచన చేసే లక్షణాన్ని కలిగి ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, అల్జీమర్స్‌ని దూరం చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories