Dimples: సొట్ట బుగ్గలు అందం కాదు.. ఆరోగ్య సమస్య

Dimples
x

Dimples: సొట్ట బుగ్గలు అందం కాదు.. ఆరోగ్య సమస్య

Highlights

Dimples: కొంత మందికి పుట్టుకతోనే చెక్కిళ్లపై సొట్ట బుగ్గలు ఉంటాయి. అలాంటి వారు నవ్వినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. చాలా మంది ఇలా సొట్ట బుగ్గలు ఉన్నవారు అదృష్టవంతులు అని కూడా అంటారు.

Dimples: కొంత మందికి పుట్టుకతోనే చెక్కిళ్లపై సొట్ట బుగ్గలు ఉంటాయి. అలాంటి వారు నవ్వినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. చాలా మంది ఇలా సొట్ట బుగ్గలు ఉన్నవారు అదృష్టవంతులు అని కూడా అంటారు. దీని కోసం కొంతమంది లక్షలు కర్చు పెట్టుకోని మరీ సొట్ట బుగ్గలు ఉండేలా సర్జరీ చేయించుకుంటారు. అయితే, సొట్ట బుగ్గలు ఎందుకు వస్తాయి? దీని వెనుక కారణం ఏంటి? ఇలా ఉన్న వారు నిజంగా అదృష్టవంతులా? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సొట్ట బుగ్గలు ఎందుకు వస్తాయి?

మన ముఖంలోని అతి ముఖ్యమైన కండరాలలో జైగోమాటికస్ కండరం ఒకటి. మనం నవ్వినప్పుడు ఈ కండరం బుగ్గలపై ఒత్తిడిని తెస్తుంది, ఇది చర్మాన్ని లోపలికి లాగుతుంది. కొన్ని సందర్భాల్లో, ఈ కండరం రెండు భాగాలుగా విడిపోతుంది. అలాంటి సందర్భాల్లోనే చెక్కిళ్లపై సొట్ట బుగ్గలు పడతాయి. అయితే, ఈ సొట్ట బుగ్గలు అందాన్ని ప్రతిబింబించవు. కండరాలు, ఎముకల వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖంలోని ఎముకలు కలిసిపోనప్పుడు ఈ సమస్య కలుగుతుంది. పిండం అభివృద్ధి సమయంలో, దవడ రెండు భాగాలు పూర్తిగా కలిసిపోనప్పుడు, ఒక చిన్న ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీపై చర్మం ఒక ప్రత్యేకమైన చీలికను ఏర్పరుస్తుంది. అది చర్మంపై సొట్ట బుగ్గలాగా కనిపిస్తుంది. ఇది మీ పెద్దల నుండి కూడా వారసత్వంగా రావచ్చు.

ఆరోగ్యంపై ప్రభావం

సొట్ట బుగ్గలు సాధారణంగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, అవి కండరాల వ్యత్యాసాల వల్ల వచ్చే సమస్య అయినప్పటికీ, అవి శరీరానికి ఏ విధంగానూ హాని కలిగించవు. కొంతమందిలో, ఇది చిన్న వయస్సు నుండే స్పష్టంగా కనిపించవచ్చు. మరికొందరిలో ఇది అస్పష్టంగా ఉండవచ్చు. అవి వంశపారంపర్యంగా వచ్చినా లేదా కండరాల ఆకారంలో తేడాల వల్ల అయినా అవి శరీరానికి ఏ విధంగానూ హానికరం కాదు.

అదృష్టవంతులా?

జ్యోతిష్య శాస్త్రంలో, సొట్ట బుగ్గలు ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ఇలాంటి వారి జీవితంలో అడ్డంకులు తక్కువగా ఉంటాయని, విజయాలు సులభంగా సాధిస్తారని నమ్ముతారు. అయితే, ఇవన్నీ నమ్మకాలు మాత్రమే, శాస్త్రీయంగా దీనికి ఎలాంటి ఆధారాలు లేవు.

Show Full Article
Print Article
Next Story
More Stories