Digital Strain: అతిగా స్క్రీన్ చూస్తున్నారా? మీ మెదడు ఇచ్చే డేంజర్ బెల్స్ ఇవే!

Digital Strain: అతిగా స్క్రీన్ చూస్తున్నారా? మీ మెదడు ఇచ్చే డేంజర్ బెల్స్ ఇవే!
x

Digital Strain: అతిగా స్క్రీన్ చూస్తున్నారా? మీ మెదడు ఇచ్చే డేంజర్ బెల్స్ ఇవే!

Highlights

డిజిటల్ అలవాట్లు మీ మెదడుపై ప్రభావం చూపుతున్నాయా?.. ఫోకస్ తగ్గడం నుంచి నిద్రలేమి వరకు ఇవే హెచ్చరిక సంకేతాలు!

ఈ ఆధునిక సాంకేతిక జీవితంలో మొబైల్, ల్యాప్‌టాప్‌లు మన జీవితంలో విడదీయలేని భాగమయ్యాయి. చదువు, ఉద్యోగం, వినోదం ఇలా ప్రతిదీ స్క్రీన్ చుట్టూనే తిరుగుతోంది. అయితే, ఈ అలవాటు కేవలం మన కళ్లకే కాదు, మెదడుకు కూడా తీవ్రమైన ముప్పుగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం స్క్రీన్ చూడటం వల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుంది, దీనివల్ల కలిగే ఇబ్బందులు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నిరంతరం డిజిటల్ స్క్రీన్ చూడటం వల్ల కలిగే ప్రధాన ఇబ్బందులు ఇవే..

* స్క్రీన్ నుంచి వచ్చే కాంతి మెదడును ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతుంది, దీనివల్ల మెదడుకు తగినంత విశ్రాంతి దొరకదు.

* గంటల తరబడి స్క్రీన్లు చూడటం వల్ల నిద్రపోయే సమయం మారిపోతుంది, ఇది నేరుగా జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.

* అతిగా డిజిటల్ పరికరాలను వాడటం వల్ల చిరాకు పెరగడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. మీ మెదడు అలసిపోయిందని చెప్పడానికి పలు సంకేతాలు కనిపిస్తాయని అన్నారు. తరచూ వచ్చే తలనొప్పి, త్వరగా అలసిపోవడం, పనులపై శ్రద్ధ తగ్గడం, చిన్న విషయాలకే చిరాకు పడటం, జ్ఞాపకశక్తి తగ్గడం, పనిలో తప్పులు చేయడం, ఆందోళన, గందరగోళం లేదా నిద్ర పట్టకపోవడం వంటి సంకేతాలు మీకు కనిపించినప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం చేయకూడదని చెబుతున్నారు.

మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు..

* ప్రతి 30 నుంచి 40 నిమిషాలకు ఒకసారి పని ఆపి, కళ్లకు, మెదడుకు చిన్న బ్రేక్ ఇవ్వండి.

* పడుకోవడానికి కనీసం ఒక గంట ముందే మొబైల్, ల్యాప్‌టాప్‌లను పక్కన పెట్టేయండి.

* కేవలం డిజిటల్ ప్రపంచంలోనే కాకుండా, కాసేపు బయట తిరగడం, వ్యాయామం చేయడం వంటివి అలవాటు చేసుకోండి.

* పని మధ్యలో తగినంత నీరు తాగుతూ, దీర్ఘ శ్వాస తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

* ముఖ్యంగా పిల్లలు, టీనేజర్ల స్క్రీన్ టైమ్ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

టెక్నాలజీ మన సౌకర్యం కోసం ఉండాలి కానీ, అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన జీవనశైలి, పరిమిత స్క్రీన్ వాడకం ద్వారా మనం మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories