అందమైన పెదాలకు లిప్‌స్టిక్‌ను ఉపయోగిస్తున్నారా..!

అందమైన పెదాలకు లిప్‌స్టిక్‌ను ఉపయోగిస్తున్నారా..!
x
Highlights

చాల మంది అమ్మాయిలు లిప్‌స్టిక్ ని వేసుకోవటానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు లిప్‌స్టిక్ ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. లుక్‌ని పెదాలకు...

చాల మంది అమ్మాయిలు లిప్‌స్టిక్ ని వేసుకోవటానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు లిప్‌స్టిక్ ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. లుక్‌ని పెదాలకు వేసుకున్న లిప్‌స్టిక్ మార్చేస్తుంది. అందుకే టీనేజీ అమ్మాయిలు లిప్‌స్టిక్ వేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. పెదాలు అందంగా కనిపించటం కోసం వివిధ రకాల లిప్‌స్టిక్ ను వాడేవాళ్లు ఉన్నారు. కొంత మంది ఏ రంగు లిప్ స్టిక్ వాడలో తెలియక అయోమయానికి గురైవుతుంటారు. అయితే పెదవుల సైజ్‌ని బట్టి కూడా లిప్‌స్టిక్ రంగుల్లో మార్పులు చేస్తే.. మంచి లుక్ వస్తుదంటున్నారు బ్యూటీషియన్లు.

పై పెదవి పెద్దగా ఉంటే.. బ్రైట్ కలర్ కింద పెదవికి వేసి.. అందులోనే ఇంకాస్త డార్క్ కలర్‌ని పై పెదవికి వేయడం వల్ల పెదవులు రెండు ఒకేలా కనిపిస్తాయి. కింద పెదవి లావుగా ఉంటే.. ఏ రంగులనైనా ఎంచుకోవచ్చు అంటున్నారు. కాకపోతే పై పెదవికి మధ్యలో కాస్త లైట్ చేస్తే మరింత బాగా పెదవులు కనిపిస్తాయి అంటున్నారు బ్యూటీషియన్లు. రెండు పెదవులు బొద్దుగా ఉంటే.. మెరిసే పెదవుల రంగు మరింత బాగుంటుంది అంటున్నారు బ్యూటీషియన్లు.

అలాగే రంగును బట్టి లిప్‌స్టిక్‌ కలర్ ఎంచుకోవాలంటున్నారు బ్యూటీషియన్లు. అమ్మాయి ఫెయిర్‌గా ఉంటే.. దాదాపు అన్ని కలర్స్ సూటవుతాయి. కానీ అన్నిటికంటే.. లైట్ పింక్, కోరల్, పీచ్, న్యూడ్, డస్టీ రెడ్ కలర్స్ ఏవైనా బాగుంటాయి. లైట్ కలర్‌లో ఉండే అమ్మాయిలు కూడా ఇవే రంగులను ట్రై చేసి మరింత అందంగా కనిపించొచ్చు అంటున్నారు బ్యూటీషియన్లు . మీడియం తెలుపు రంగులో ఉండే అమ్మాయిలయితే.. రోజ్, బెర్రీ, చెర్రీ రెడ్ రంగులు పెదవులను మరింత ఆకర్షణీయంగా చూపిస్తాయి. ట్యాన్ కలర్ ఉండేవాళ్లు.. రాక్ కోరల్, డీప్ పింక్, బ్రైట్ రెడ్ వేసుకోవచ్చు. బ్రౌన్, పర్పుల్ షేడ్స్ జోలికి వెళ్లకపోవడం మంచిది అంటున్నారు. దీనివల్ల వీళ్లు మరింత నల్లగా కనిపించే అవకాశం ఉందటున్నారు బ్యూటీషియన్లు. డీప్ కలర్ ఉన్నవాళ్లు.. బ్రౌన్, పర్పుల్ షేడ్స్ ఏవైనా ట్రై చేయొచ్చు. కారమిల్, వైన్ రంగులో ఉండే లిప్‌స్టిక్ వీరిని ప్రత్యేకంగా చూపిస్తాయి అంటున్నారు బ్యూటీషియన్లు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories