నైట్ టైంలో పెరుగుతో ఆహారం తీసుకుంటున్నారా..!

నైట్ టైంలో పెరుగుతో ఆహారం తీసుకుంటున్నారా..!
x
Highlights

పెరుగుతో అన్నం తినకపోతే.. చాలమందికి సంపూర్ణంగా తిన్న తృప్తి ఉండదు. ఏదో వెలితిగా ఉంటుంది. కొంత మందికి ఆహారంలో పెరుగు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే...

పెరుగుతో అన్నం తినకపోతే.. చాలమందికి సంపూర్ణంగా తిన్న తృప్తి ఉండదు. ఏదో వెలితిగా ఉంటుంది. కొంత మందికి ఆహారంలో పెరుగు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే రాత్రిపూట పెరుగు తినకూడదని చాలమంది బావిస్తుంటారు. రాత్రిపూట నేరుగా గానీ, అన్నంలో కలుపుకుని గానీ పెరుగు తింటే జలుబు, శ్వాస సంబంధమైన సమస్యలు వస్తాయని చాలమంది భయపడుతుంటారు. అయితే నైట్ టైమ్ లో పెరుగు తినడం వల్ల ప్రమాదమేమి లేదంటున్నారు.

రోజూ పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు కూడా చెబుతుంటారు. పెరుగు శరీరానికి అన్ని రకాలుగానూ మంచిదే అంటున్నారు నిపుణులు. రోజు ఒక కప్పు పెరుగు తింటే మనకు కావాల్సిన ప్రొటీన్ మొత్తం అందుతుందంటున్నారు. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అరుగుదల సమస్యను నివారిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు రాత్రి తింటే మాత్రం జలుబు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories