Top
logo

అక్కడ వజ్రాల వర్షం కురుస్తుందట!

అక్కడ వజ్రాల వర్షం కురుస్తుందట!
X
Highlights

వజ్రాల వర్షమా.. ఎక్కడో తెలిస్తే వెళ్లి తెచ్చుకోవచ్చు.. అని ఆలోచిస్తున్నారా..! భూమి మీద మాత్రం కాదులేండి.. సౌర...

వజ్రాల వర్షమా.. ఎక్కడో తెలిస్తే వెళ్లి తెచ్చుకోవచ్చు.. అని ఆలోచిస్తున్నారా..! భూమి మీద మాత్రం కాదులేండి.. సౌర కుటుంబంలో ఉండే ఓ గ్రహం మీద. అక్కడ వాతావరణం మనం ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది. సౌర కుటుంబంలో వాయువులతో ఏర్పడిన విశాలమైన గ్రహాం నెప్ట్యూన్. ఈ గ్రహం మీద వజ్రాల వర్షం కురిసేది.

నెప్ట్యూన్ భూమికి అత్యంత దూరంలో ఉంది. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు.. అక్కడ 0 నుంచి మైనస్ 200 డిగ్రీల వరకూ ఉంటుంది. అక్కడ పేరుకుపోయిన మీథేన్ మేఘాలు ఎగురుతుండటం విశేషం. సౌర కుటుంబంలో ఉన్న మిగతా గ్రహాల కంటే అక్కడ తీవ్రంగా పెను గాలులు వీస్తుంటాయి. నెప్ట్యూన్ ఉపరితలం మీద పర్వతాల్లాంటివి ఏవీ ఉండవు. అందుకే మీథేన్ వేగం 2400 కిలోమీటర్ల వరకూ చేరుతుంది.

నెప్ట్యూన్ వాతావరణంలో గడ్డకట్టిన కార్బన్ ఉంటుంది. దీనివల్ల వజ్రాల వర్షం కురుస్తుందట. అక్కడ వెళిన వారిమీద కురిసే వజ్రాల వర్షానికి గాయాలవుతాయేమో అని ఏమాత్రం కంగారు పడనక్కర్లేదు. ఎందుకంటే అక్కడున్న తీవ్రమైన చలి ఉంటుంది. దీనివల్ల అక్కడికి వెళ్లిన వారు రాయిలా గడ్డకట్టుకుపోతారు. ఇక దెబ్బలు తగిలే ఛాన్స్ ఉండదు.

Next Story