Diabetes: డయాబెటిస్‌ ఉన్న ప్రతీ ఒక్కరికీ వచ్చే సందేహం ఇదే.. సమాధానం ఏంటంటే

Diabetes: డయాబెటిస్‌ ఉన్న ప్రతీ ఒక్కరికీ వచ్చే సందేహం ఇదే.. సమాధానం ఏంటంటే
x
Highlights

Diabetes Diet Tips: డయాబెటిస్ అనేది జీవనశైలి కారణంగా వచ్చే తీవ్రమైన వ్యాధి. సరైన ఆహార నియమాలు పాటించకపోతే, ఇది శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించవచ్చు.

Diabetes: డయాబెటిస్ అనేది జీవనశైలి కారణంగా వచ్చే తీవ్రమైన వ్యాధి. సరైన ఆహార నియమాలు పాటించకపోతే, ఇది శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించవచ్చు. అందుకే మధుమేహంతో బాధపడే వారు తమ ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు, ఏ ఆహారం తీసుకోవాలి? ఏది మానుకోవాలి? అనే విషయాల్లో స్పష్టమైన అవగాహన అవసరం. అందుకే ఒక్కసారి డయాబెటిస్‌ వచ్చిందంటే చాలా జీవితాంతం జీవన విధానంలో పలు మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇంతకీ షుగర్‌ పేషెంట్స్‌ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* డయాబెటిస్‌ పేషెంట్స్‌ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్‌ కంటెంట్ ఉండే ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలి. మొలకెత్తిన ధాన్యాలు, మఖానాతో పాటు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న ఇతర ఆహార పదార్థాలు తినడం మంచిది.

* డ్రై ఫ్రూట్స్‌లో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. సాయంత్రం స్నాక్స్‌గా ఉప్పు లేని బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి గింజలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.

* మధుమేహం ఉన్నవారు పండ్లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొన్ని పండ్లు అధిక గ్లూకోజ్‌ను కలిగి ఉంటాయి. తక్కువ GI కలిగిన ఆపిల్, జామ, బెర్రీలు, నారింజ వంటి పండ్లను స్వల్ప పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.

* చక్కెరతో కూడిన పానీయాల బదులుగా, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే తక్కువ చక్కెర కలిగిన డ్రింక్స్‌ను తీసుకోవాలి. వీటిలో ప్రధానంగా కొబ్బరి నీరు, తక్కువ చక్కెర ఉండే సూప్‌లు వంటి వాటిని తీసుకోవాలి.

* వీటితో పాటు రోజూ వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలను తగ్గించాలి. అధిక ప్రోటీన్, ఫైబర్‌ను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే నీటిని కచ్చితంగా సరిపడ తీసుకోవాలి.

నోట్‌: ఈ వివరాలను ఇంటర్నెట్‌ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories