Diabetes: గొంతు విని మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పే టెక్నాలజీ వచ్చేసింది

Diabetes: గొంతు విని మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పే టెక్నాలజీ వచ్చేసింది
x
Highlights

Diabetes: ప్రస్తుతం ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ప్రతి విషయంలో దాని అవసరం తప్పనిసరి అయింది.

Diabetes: ప్రస్తుతం ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ప్రతి విషయంలో దాని అవసరం తప్పనిసరి అయింది. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీలో మరో పెద్ద అడుగు పడింది. ఇప్పుడు ఒక వ్యక్తికి టైప్ 2 డయాబెటిస్ ఉందో లేదో కేవలం 25 సెకన్ల వాయిస్ రికార్డింగ్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. లక్సెంబర్గ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు ఒక కొత్త ఆవిష్కరణకు ప్రాణం పోశారు. డయాబెటిస్ బారిన పడిన వ్యక్తుల గొంతులో ప్రత్యేక మార్పు ఉందని వెల్లడించారు. దీనిని 'వాయిస్ సిగ్నేచర్' అని పిలుస్తారు.

స్వరంలో సూక్ష్మమైన మార్పులను గుర్తించగల ప్రత్యేక ఏఐ అల్గారిథమ్ లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. టైప్ 2 డయాబెటిస్ శరీరంలోని ఊపిరితిత్తులు, కండరాలు, నరాలను ప్రభావితం చేస్తుంది. ఇది తేలికపాటి బొంగురుపోవడం లేదా గొంతులో ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ అల్గారిథమ్ 607 మంది వ్యక్తుల వాయిస్ రికార్డింగ్‌లపై పరీక్షించారు. ఈ వ్యక్తులను 30 సెకన్ల పాటు ప్రత్యేక వచనాన్ని చదవాలని సూచించారు.

పరిశోధన ఫలితాల ప్రకారం.. ఈ AI అల్గోరిథం 71% మంది పురుషులు, 66% మంది స్త్రీలలో టైప్-2 డయాబెటిస్‌ను కచ్చితంగా గుర్తించగలిగింది. ఈ పరిశోధన ఇటీవల PLOS డిజిటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. భవిష్యత్తులో, ఈ టెక్నాలజీ సహాయంతో ప్రజలు తమ ఇళ్ల నుండే మధుమేహాన్ని గుర్తించగలుగుతారని.. సకాలంలో చికిత్స ప్రారంభించగలుగుతారని పరిశోధకులు అంటున్నారు.

లక్సెంబర్గ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లోని ప్రెసిషన్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గై ఫెగ్రాజ్జి, టైప్ 2 డయాబెటిస్ ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తుందని వివరిస్తున్నారు. మనం మాట్లాడేటప్పుడు గాలి స్వరపేటిక గుండా వెళుతుంది.. కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో మెడ , గొంతు చిన్న కండరాలు పనిచేస్తాయి. ఇది మధుమేహం ద్వారా ప్రభావితమవుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు తరచుగా కొంచెం గొంతు బొంగురుపోవడం, ఉద్రిక్తత, అచ్చు శబ్దాలలో మార్పులు ('ఆహ్' వంటివి) అనుభవిస్తారు.

ఈ టెక్నిక్ కేవలం మధుమేహానికి మాత్రమే పరిమితం కాలేదు. మానసిక ఆరోగ్యం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులను గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఇప్పుడు AIని కూడా ఉపయోగిస్తున్నారు. పరిశోధన ప్రకారం.. నిరాశతో బాధపడుతున్న వ్యక్తి స్వరం తక్కువ శక్తి, ఏకరీతిగా ఉంటుంది. పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో AI చాలా ఖచ్చితమైనదని నిరూపణ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories