ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అయితే దంతాలు..!

ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అయితే దంతాలు..!
x
Highlights

ఫ్రూట్ జ్యూస్ తాగితే.. పళ్లు ఊడిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. పులియబెట్టిన ఫ్లేవర్డ్ నీళ్లు, ఫ్రూట్ స్క్వాష్‌లు తాగటం వల్ల దంతాలు దెబ్బతినే...

ఫ్రూట్ జ్యూస్ తాగితే.. పళ్లు ఊడిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. పులియబెట్టిన ఫ్లేవర్డ్ నీళ్లు, ఫ్రూట్ స్క్వాష్‌లు తాగటం వల్ల దంతాలు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో ఉండే యాసిడ్ వల్ల.. పళ్లు ఊడిపోయే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది.

పండ్ల రుచులున్న నీళ్లు, టీ, డైట్ డ్రింకులు, చక్కెర కలిపిన పానీయాలు తరచుగా తాగటం వల్ల దంత సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిల్వ చేసిన పండ్ల గుజ్జు తినటం వల్ల పళ్లకి ప్రమాదం ఉంటుందని వారు చెబుతున్నారు. చాలమంది డ్రింక్స్ చాల నెమ్మదిగా తాగుతుంటారు. ఇలా తాగటం వల్ల పళ్లు పాడవుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఐదు నిమిషాలకు మించి ఎక్కువ సేపు డ్రింకుల్ని తాగినా, పండ్లను వెంటనే తినకుండా, కొంచెం కొంచెం నములుతూ, నోట్లో ఎక్కువసేపు పెట్టుకుని తిన్నా పంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కొంతమంది లంచ్ టైంలో ఆపిల్ తింటారు. ఇలా తినడం వల్ల కూడా పంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఒకవేళ తప్పని పరిస్థిలో మధ్యాహ్న భోజన సమయంలో ఆపిల్‌ను తింటే.. ఆ తర్వాత మళ్లీ ఆమ్ల గుణాలున్నవి ఏవీ తినకపోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories