Health: శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గిందా.. ఇలా చేస్తే వెంటనే రెట్టింపు..!

Decreased Platelet Count in the Body Doubling Immediately if You Do This
x

Health: శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గిందా.. ఇలా చేస్తే వెంటనే రెట్టింపు..!

Highlights

Health: శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గిందా.. ఇలా చేస్తే వెంటనే రెట్టింపు..!

Health: జ్వరం బారిన పడిన వెంటనే శరీరంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లేట్‌లెట్స్ అంటే చిన్న రక్త కణాలు. ఇవి ముఖ్యంగా ఎముక మజ్జలో తయారవుతాయి. మీ శరీరంలో ప్లేట్‌లెట్స్ లోపిస్తే మీ రక్తం వ్యాధులతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి శరీరంలో మైక్రోలీటర్‌కు 150 వేల నుంచి 450 వేల ప్లేట్‌లెట్స్ ఉండాలి. ఇంతకన్నా తక్కువగా ఉంటే అది శరీరానికి అస్సలు మంచిది కాదు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్లేట్‌లెట్స్ తగ్గిపోయాయని తెలిపే సూచనలు

మైకము, కండరాల నొప్పి, ముక్కు, నోటి రక్తస్రావం, ఎరుపు మూత్రం, చర్మంపై దద్దుర్లు ఇవి కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి. అంతేకాదు డాక్టర్‌ని సంప్రదించాలి.

బొప్పాయి ఆకుల వినియోగం

మీ శరీరంలో ప్లేట్‌లెట్స్ కొరత ఉంటే బొప్పాయి ఆకులు మీకు చాలా మేలు చేస్తాయి. బొప్పాయి ఆకులను రోజూ 2 నుంచి 3 రోజులు తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పెరుగుతుంది. బొప్పాయి ఆకుల రసం చేదుగా ఉంటుంది అయితే దీనిని తాగడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అందులో తేనె లేదా బెల్లం కలిపి తాగితే రుచిగా ఉంటుంది.

ఈ విషయాలపై శ్రద్ధ వహించండి

ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి ఇంటర్నెట్‌లో అనేక ఐడియాలు ఉన్నాయి. అయితే అవన్ని మీకు ఆరోగ్యకరమైన ఫలితాలను ఇవ్వగలవన్న నమ్మకం లేదు. కొన్ని హానికూడా కలిగించవచ్చు. మీరు బొప్పాయి ఆకులను తినాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. దీంతో పాటు మీరు తాజా పండ్లు, కూరగాయలను తీసుకోండి. అయితే ఇవన్నీ తీసుకునే ముందు కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories