Top
logo

వాతావరణానికి తగ్గట్టుగా మేకప్!

Highlights

మనం సాధరణంగా వేసుకుని మేకప్‌లో సమయపాలన పాటించాలి. వాతావరణం తగ్గట్టుగా శరీరంలోని రంగుకూడా కాస్త మారుతుంటుంది....

మనం సాధరణంగా వేసుకుని మేకప్‌లో సమయపాలన పాటించాలి. వాతావరణం తగ్గట్టుగా శరీరంలోని రంగుకూడా కాస్త మారుతుంటుంది. కాలాన్ని బట్టి ఎలా

మెకప్ వేసుకోవాలో తెలుసుకుందాం .వర్షకాలం మెకప్ వేసుకుని బయటకు వెళ్ళితే చెరిపోతుందేమో బెంగ పడుతుంటారు. అలా పోకుండా ఉండాలంటే దానికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే...మేకప్ వేసుకునేముందు మీరు ఫౌండేషన్ వేసుకుంటుంటారు. ఫౌండేషన్‌కు బదులుగా ఫేస్ పౌడర్‌ను ముఖానికి అప్లై చేసుకోవాలి. కళ్ళకు వాడే సాధనాలు ఉదాహరణకు ఐ లైనర్ లేదా మస్కరాలను ఉపయోగించాలి. అలాగే ప్రస్తుతం మార్కెట్లో వాటర్ ప్రూఫ్ రేంజ్‌కూడా లభ్యమవుతున్నాయి. దీంతో మీరు మీకు నచ్చిన విధంగా మేకప్ వేసుకోవచ్చు. చినుకులు పడుతున్న మేకప్‌ను పాడు చేస్తాయనే బాధ ఇకపై ఉండదు. వాతావరణానికి తగ్గట్టు వెంట్రుకలపైకూడా దృష్టి పెట్టాలి. మహిళలు తమ వెంట్రుకలు అందంగా నిగనిగలాడేలా ఉండేందుకు జెల్‌ను వాడుతుంటారు. వీటి వల్ల వెంట్రుకల్లో చుండ్రు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి బదులుగా గోరువెచ్చటి నూనెతో తలకు మర్దన చేయండి. దీంతో మీ పొడవాటి వెంట్రుకలను నిగనిగలాడుతాయి.

Next Story