Curry Leaves: ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల కలిగే అద్భుతాలు ఇవే..

Curry Leaves: ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల కలిగే అద్భుతాలు ఇవే..
x
Highlights

Curry Leaves Benefits: కరివేపాకును కూరల్లో ఉపయోగిస్తాం. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది అయితే ఖాళీ కడుపున కరివేపాకు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ..

Curry Leaves Benefits: కరివేపాకు కంటిచూపుకు ఎంతో మంచిది. ప్రతికూరలో కరివేపాకు లేనిదే కూర తయారు చేసుకోలేని పరిస్థితి. అయితే దీంతో రుచి అద్భుతంగా ఉంటుంది. మంచి ఆరోమా వస్తుంది. కంటి ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది. కరివేపాకు రెగ్యులర్‌గా మన డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనంతో పాటు బ్యూటీ పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే పరగడపున కరివేపాకు ఆకులు నమలడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

కరివేపాకు రుచికి మాత్రమే కాదు.. ఇది ఒక అద్భుతమైన మూలిక ప్రధానంగా ఉబకాయంతో బాధపడుతున్న వారు కడివేపాకును ప్రతిరోజు ఉదయం పరగడుపున నమలాలి. తద్వారా ఉబకాయాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. కరివేపాకులో హెపో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి. దీంతో కాలేయ ఆరోగ్యం బాగుంటుంది. సహజ సిద్ధంగా మన శరీరంలో నుంచి విష పదార్థాలు బయటికి పంపిస్తుంది.

అంతేకాదు కరివేపాకు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించేస్తుంది. ఇందులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తద్వారా ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇందులో హైపో గ్లైసెమిక్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు కరివేపాకు మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగవ్వకుండా నివారిస్తుంది.

ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతున్న వారు కరివేపాకును నమలాలి. ఇందులో ఉండే ఇనుము, కాల్షియం, జింక్‌ లక్షణాలు రక్తహీనత నుంచి మనల్ని కాపాడతాయి. రెగ్యులర్‌గా కరివేపాకు తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇలా తరచూ కరివేపాకును తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్య కూడా వేధించదు. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసుకొని జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గిపోతుంది అంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories