టీవీలో చూసినవి నిజమవుతాయని పిల్లలు నమ్ముతున్నారా?

టీవీలో చూసినవి నిజమవుతాయని పిల్లలు నమ్ముతున్నారా?
x
Highlights

టీవీలో చూసినవి నిజమవుతాయని పిల్లలు నమ్ముతున్నరా?

ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలు ఓ సమస్యగా మారిపోయారు. ఏది తప్పు.. ఏది ఓప్పని తెలుసుకోవడంలో పిల్లలు దారుణంగా విఫలమవుతున్నారు. చాలా మంది అంతర్జాలంలో వచ్చే వీడియోల పట్ల ఆకర్షితులై అందులో మునిగి తెలుతున్నారు. వాటిలో వచ్చే దొంగతనాలు, నేరాలు, దయ్యాలు, రాక్షసులకు పంబంధించిన సన్నివేశాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆ దృశ్యాలను చూసి తాను భయపడలేదని గొప్పగా స్నేహితుల దగ్గర చెప్పుకోవడం కోసం వారిని ఆ వైపుకు ఆకర్షితులయ్యాలే చేస్తుంది.

నిజానికి వాటిని ధైర్యంగా, ఇష్టంగా చూసినా కానీ అవి క్రమంగా వారిలో అంతర్లీనంగా భయం మొదలయేలా చేస్తుంది. టీవీ, సినిమా కార్యక్రమాల్లో చూపించినట్లుగా ఒంటరిగా ఉన్నప్పుడూ, చీకటి పడినప్పుడు దయ్యాలు వస్తాయని రాత్రి సమయాలలోనే దొంగతనాలు జరిగుతాయనే అభూత కల్పనలో వారిలో కలుగుతుంది. దాంతో పిల్లలు వర్చువల్ లైఫ్‌లో బతుకుతుంటారు. ఆ పరిస్థితుల్లోనే ఇలాంటివన్నీ జరుగుతాయని గట్టిగా నమ్ముతారు.

దీంతో అకస్మాత్తుగా కరెంట్‌ పోయినప్పుడు పైవాటిని తలుచుకుని భయనడుతుంటారు. క్రమంగా ఈ భయం పెరిగి ఫోబిక్‌ యాంగ్జైటీ డిజార్డర్‌ లోకి వెళ్ళిపోతారు. కావున ముందుగా వారిని ఆ అభూత కల్పనలో నుంచి బయటకు తీసుకరండి. వారు అనుకునేది అంతా భ్రమ అనే విషయాన్ని పిల్లలకు చేప్పండి. టీవి చూడటం, చదువుకోవడం, నిద్ర.. ఇలా ప్రతిదీ ప్రణాళికాబద్ధం చేయండి. టీవీలో కేవలం హార్రర్‌ ప్రోగ్రామ్‌లే కాకుండా కామెడీ, కార్టూన్‌ షోలను వారికి చూపించండి. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం.. వంటివి వారికి నేర్పండి. కథలు చెప్పండి. చిన్న చిన్న పజిల్ పూర్తి చేయించండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories