డిప్రెషన్‌ని దూరం చేసే పుట్టగొడుగులు

డిప్రెషన్‌ని దూరం చేసే పుట్టగొడుగులు
x
Highlights

ఎంతో మందిని బాధిస్తున్న మానసిక కుంగుబాటును దూరం చేసే అద్భుత లక్షణాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయంటున్నారు పరిశోధకులు. వీటిలో మొదడును రీసెట్ చేసే...

ఎంతో మందిని బాధిస్తున్న మానసిక కుంగుబాటును దూరం చేసే అద్భుత లక్షణాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయంటున్నారు పరిశోధకులు. వీటిలో మొదడును రీసెట్ చేసే ఉత్ర్పేరకాలు ఉన్నట్లు తాజా పరిశీలనల్లో స్పష్టమైంది. డిప్రెషన్‌ను తగ్గించే గుణం పుట్టగొడుగుల్లో ఉందా? అన్న విషయం మీద లండన్‌కు చెందిన పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. పుట్టగొడుగుల నుంచి తీసిన సైలోసైబిన్ అనే పదార్ధాన్ని మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న 19 మందికి ఇచ్చారు.

దీన్ని తీసుకున్న తరువాత తమ మెదడులో మంచి మార్పులు వచ్చాయని సగం మంది చెప్పారంట..సైలోసైబిన్ ఇవ్వక ముందు, ఇచ్చిన ఒక రోజు తరువాత కొగెల మెదడును స్కాన్ చేసి మెదడులోని రెండు కీలక మార్పులను గుర్తించారు. అయితే ఈ అధ్యయనం డిప్రెషన్‌లో ఉన్నవారిపై మాత్రమే నిర్వహించారు. దీనిమీద ఇంకా పరిశోధనలు నిర్వహించాలని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories