నల్లమందుతో దగ్గుకి చికిత్స.. మొట్టమొదటి దగ్గు సిరప్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు..!

Cough Treatment With Opium You Will Be Surprised to Know the History of the Worlds First Cough Syrup
x

నల్లమందుతో దగ్గుకి చికిత్స.. మొట్టమొదటి దగ్గు సిరప్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు..!

Highlights

నల్లమందుతో దగ్గుకి చికిత్స.. మొట్టమొదటి దగ్గు సిరప్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు..!

Cough Syrup Controversy: దేశంలో దగ్గు సిరప్‌పై చాలా చర్చ జరుగుతోంది. నాలుగు దగ్గు సిరప్‌ సంస్థలకి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిక జారీ చేసింది . గాంబియాలో 66 మంది పిల్లలు మరణించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. దగ్గు సిరప్‌లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని సంస్థ ఆరోపిస్తుంది. వీటిని తయారుచేస్తున్న కంపెనీలపై విచారణ మొదలెట్టింది. అయితే దగ్గు సిరప్‌పై వివాదం ఇదే తొలిసారి కాదు. ప్రపంచంలోనే మొట్టమొదటి దగ్గు సిరప్ గురించి తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి దగ్గు సిరప్‌ను 127 సంవత్సరాల క్రితం జర్మనీలో తయారు చేశారు. దీనిని జర్మన్ కంపెనీ బేయర్ తయారు చేసింది. ఇందులో ఆస్పిరిన్ మందు వాడారు. ఈ సిరప్ రాకముందు దగ్గును నయం చేయడానికి నల్లమందు వాడేవారు. ఇది శరీరంలోకి చేరిన తర్వాత మార్ఫిన్‌గా విడిపోతుంది. ఈజిప్టులో దగ్గుతో సహా అనేక వ్యాధులను నయం చేయడానికి నల్లమందు ఉపయోగించేవారు.

ఇక్కడి నుంచే సిరప్‌ను తయారు చేయాలనే ఆలోచన బేయర్‌కు కంపెనీకి వచ్చింది. మార్ఫిన్‌ను వేడి చేసినప్పుడు డయాసిటైల్‌మార్ఫిన్‌ ఏర్పడుతుందని కంపెనీ తన ప్రయోగంలో గమనించింది. ప్రజలు దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా ప్రపంచంలోనే మొట్టమొదటి సిరప్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ప్రజల దగ్గును నయం చేయడమే కాకుండా TB లేదా బ్రోన్కైటిస్ ఉన్నవారికి కూడా ఉపశమనం కలిగించింది. కాలక్రమేణా ప్రజలు దీనికి బానిసలుగా మారిపోయారు. దీంతో దీనిపై వ్యతిరేకత మొదలైంది. చివరికి 1913లో, బేయర్ దగ్గు సిరప్‌లను నిషేధించింది. ఉత్పత్తిని నిలిపివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories