కూల్ డ్రింక్‌ తాగితే ఆ వ్యాధి వస్తుందా..!

కూల్ డ్రింక్‌ తాగితే ఆ వ్యాధి వస్తుందా..!
x
Highlights

కొంచెం ఎండగా ఉంటే కూల్ డ్రింక్ తాగేవాళ్లు ఉన్నారు. ఇంట్లో శుభకార్యాలు జరిగితే కూల్ డ్రింక్స్ ఇచ్చేవారు ఉన్నారు. ఇక మందు బాబుల గురించి ప్రత్యేకంగా...

కొంచెం ఎండగా ఉంటే కూల్ డ్రింక్ తాగేవాళ్లు ఉన్నారు. ఇంట్లో శుభకార్యాలు జరిగితే కూల్ డ్రింక్స్ ఇచ్చేవారు ఉన్నారు. ఇక మందు బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కూల్ డ్రింక్‌లో చక్కెర మరియు గ్యాస్ ఉంటుంది. కూల్ డ్రింక్‌లో ఏడు చెంచాల చక్కెరకు సమానమైన తీపి ఉంటుంది. ఇలాంటి కూల్‌డ్రింక్ తాగటం వలన ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట.

అలాగే స్వీట్ కూల్ డ్రింక్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, వాటిలో రంగు కోసం వాడే కొన్ని రసాయనాలు క్యాన్సర్ ముప్పును పెంచుతుండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. తియ్యటి పానీయాల వల్ల హృద్రోగాలు, ఊబకాయం, మధుమేహం ముప్పు పెరుగుతందని అధ్యయనాలు తేల్చాయి.

కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో కార్బన్ డై ఆక్సైడ్‌ ఉంటుంది. దాన్ని తాగినప్పుడు జీర్ణాశయంలో కార్బన్ డై ఆక్సైడ్‌ విడుదలవుతుంది. అక్కడ రసాయన చర్యలు జరిగి ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్ స్థాయిని అది పెంచుతుంది. మరో కారణం, కడుపులో గ్యాస్ చేరడం వల్ల అది ఉబ్బిపోతుంది. దీంతో అందులోని కణాలు గ్రెలిన్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే కార్బొనేటెడ్, నాన్ కార్బొనేటెడ్ డ్రింక్స్‌లలో ఏవి మంచివి కావంటున్నారు నిపుణులు. వీటికి బదులు మంచినీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories