Cooking Utensils : ఈ పాత్రల్లో వంట చేస్తే ప్రమాదమే!

Cooking Utensils : ఈ పాత్రల్లో వంట చేస్తే ప్రమాదమే!
x

Cooking Utensils : ఈ పాత్రల్లో వంట చేస్తే ప్రమాదమే!

Highlights

వంట చేయడం కోసం మార్కెట్లో రకరకాల పాత్రలు దొరుకుతుంటాయి. ఇవి రకరకాల మెటల్స్‌తో తయారవుతుంటాయి. అయితే వీటిలో అన్ని మెటల్స్ వంటకు సేఫ్ కాదు. ఏయే పాత్రలు వంటకు మంచివి? ఏవి కావో.. ఇప్పుడు తెలుసుకుందాం.

Cooking Utensils : వంట చేయడం కోసం మార్కెట్లో రకరకాల పాత్రలు దొరుకుతుంటాయి. ఇవి రకరకాల మెటల్స్‌తో తయారవుతుంటాయి. అయితే వీటిలో అన్ని మెటల్స్ వంటకు సేఫ్ కాదు. ఏయే పాత్రలు వంటకు మంచివి? ఏవి కావో.. ఇప్పుడు తెలుసుకుందాంద.

కిచెన్‌లో వంట కోసం నాన్ స్టిక్, అల్యూమినియం, ఐరన్, కాపర్.. ఇలా రకరకాల పాత్రలు వాడుతుంటారు. అయితే వీటిలో కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు కారణం అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

వంటకు వాడకూడని మెటల్స్‌లో అల్యూమినియం మొదటిది. అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం వల్ల బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ఎక్కువ కాలం పాటు ఈ పాత్రలు వాడడం ద్వారా అల్యూమినియం కలిగి కొద్దికొద్దిగా వంటల్లో కలుస్తుంది. ఇది శరీరంలోకి చేరడం వల్ల పలు నష్టాలుంటాయి. అల్యూమినియం స్లో పాయిజన్‌లా పనిచేస్తుంది. కాబట్టి వంటలకు అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది.

కిచెన్‌లో ఎక్కువగా కనిపించేవాటిలో నాన్‌స్టిక్ పాన్స్ కూడా ఉంటాయి. వేపుళ్లకు, దోశెలకు నాన్‌స్టిక్ పాత్రలు ఎక్కువగా వాడుతుంటారు. అయితే నాన్‌స్టిక్ పాత్రలపై ఉండే టెఫ్లాన్ కోటింగ్ వంటల్లో కలిస్తే పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎసిడిస్ ఫుడ్స్ వండేటప్పుడు ఈ కోటింగ్ త్వరగా కరిపోతుంది. కాబట్టి వంటలకు వీటిని వాడకపోవడమే మంచిది.

వంటలకు కాపర్ పాత్రలు కూడా వాడుతుంటారు కొంతమంది. పండుగలప్పుడు, ప్రత్యేక సందర్భాల్లో ఇత్తడి, రాగి పాత్రల్లో వంటకాలు చేస్తుంటారు. అయితే వీటితో పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ వీటిని అత్యంత శుభ్రంగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎసిడిక్ నేచర్ ఉన్న పదార్థాలు అంటే టొమాటో, చింతపండు రసం వంటివి ఈ పాత్రల్లో వండకపోవడమే మంచిది.

ఇవి బెస్ట్

వంట చేయడానికి అన్నింటికంటే ఉత్తమమైన మెటల్స్.. స్టెయిన్ లెస్ స్టీల్, ఐరన్. స్టెయిన్ స్టీల్ పాత్రల్లో వంట చేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు. పైగా వీటిని క్లీన్ చేయడం కూడా సులభం. అలాగే కాస్ట్ ఐరన్, ఐరన్ పాన్స్ కూడా వంటకు బెస్ట్ ఆప్షన్స్‌గా చెప్పుకోవచ్చు.

ఇకపోతే ఈమధ్య మట్టి పాత్రల్లో వంట చేసే ట్రెండ్ కూడా మొదలైంది. మట్టి మాత్రల్లో వంట చేయడం వల్ల ఎలాంటి నష్టం లేకపోగా కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అయితే ఒకే పాత్రను ఎక్కువకాలంపాటు వాడకుండా చూసుకోవాలి. తరచూ పాత్రలను మారుస్తుండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories