Coconut in Planes: విమానంలో ఇది నిషేధం..పట్టుబడితే కటకటాల్లోకే..!

Coconut in Planes
x

Coconut in Planes: విమానంలో ఇది నిషేధం..పట్టుబడితే కటకటాల్లోకే..!

Highlights

Coconut in Planes: విమానంలో ప్రయాణించే ప్రయాణీకులకు అనేక ఆంక్షలు, నియమాలు ఉంటాయి. ముఖ్యంగా విమానయాన సంస్థలు విమాన ప్రయాణంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తాయి.

Coconut in Planes: విమానంలో ప్రయాణించే ప్రయాణీకులకు అనేక ఆంక్షలు, నియమాలు ఉంటాయి. ముఖ్యంగా విమానయాన సంస్థలు విమాన ప్రయాణంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తాయి. విమాన ప్రయాణంలో ఏ వస్తువులను తీసుకెళ్లవచ్చు? ఏవి తీసుకెళ్లకూడదు అని మీకు తెలుసా? పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానంలో ప్రయాణించేటప్పుడు ప్రయాణీకులు తమతో తీసుకెళ్లకూడని వస్తువుల కొత్త జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కత్తెర, నైట్ స్టిక్, తాడు, కొలిచే టేప్, ఎండిన కొబ్బరి, బ్లేడ్, గొడుగు, అగ్గిపెట్టె మొదలైనవి ఉన్నాయి. విమాన ప్రయాణంలో కత్తులు, మొబైల్ బ్యాటరీలు వంటి పదునైన వస్తువులు, లైటర్లు వంటి మండే వస్తువులను తీసుకెళ్లడం నిషేధించారని మనందరికీ తెలుసు. కానీ ఈ వస్తువులతో పాటు కొబ్బరికాయను తీసుకెళ్లడం ఎందుకు నిషేధించారో చాలా మందికి తెలియదు. కాబట్టి, కొబ్బరికాయను విమానంలో ప్రయాణించేటప్పుడు ఎందుకు తీసుకెళ్లకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

విమానంలో కొబ్బరిని ఎందుకు తీసుకెళ్లకూడదు?

విమానాశ్రయంలో ద్రవ వస్తువులను తీసుకెళ్లడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. కొబ్బరిలో ద్రవం ఉంటుంది. కాబట్టి, దీనిని విమానంలో తీసుకెళ్లకూడదు. కొబ్బరి లోపల నుండి తేమగా ఉంటూ బయట గట్టిగా ఉంటుంది. ఇవి అధికంగా నూనె కలిగి ఉంటాయి. అవి త్వరగా మంటలను అంటుకుంటాయి. విమానం లోపల వేడి పరిస్థితుల్లో ఇది అగ్నికి కారణం కావచ్చు. అందువల్ల, భద్రతా కారణాల దృష్ట్యా కొబ్బరిని విమానంలో తీసుకెళ్లడానికి అనుమతి లేదు. అయితే, కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి చెక్-ఇన్ బ్యాగ్‌లో ఉంచవచ్చని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. కొబ్బరి కాకుండా, చేపలు, మాంసం, సుగంధ ద్రవ్యాలు, మిరపకాయలు, ఊరగాయలు వంటి బలమైన వాసన కలిగిన ఆహార పదార్థాలను క్యాబిన్ బ్యాగుల్లో అనుమతించరు.

Show Full Article
Print Article
Next Story
More Stories