
వంటింట్లో కాలిపోయిన పాత్రలను ఈ చిట్కాలతో క్లీన్‌గా చేయండి..!
వంటింట్లో కాలిపోయిన పాత్రలను ఈ చిట్కాలతో క్లీన్‌గా చేయండి..!
Burnt Utensils: వంటగదిలో ఆహారం వండేటప్పుడు మన అజాగ్రత్త వల్ల చాలాసార్లు పాత్రలు కాలిపోతుంటాయి. ఇది మీ ఆహారం రుచిని పాడుచేయడమే కాకుండా ఈ పాత్రలను శుభ్రం చేయడం కష్టతరం అవుతుంది. వీటిని శుభ్రం చేసేందుకు ఇంట్లోని మహిళలు చాలా కష్టపడాల్సి వస్తోంది. చాలాసార్లు పాత్రలు శుభ్రం చేసినా వాటిలోని నల్ల మచ్చలు తొలగించబడవు. వీటిని శుభ్రం చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
కాలిన పాత్రలను శుభ్రం చేయడానికి మీరు వెనిగర్ సహాయం తీసుకోవచ్చు. దీంతో పాత్రలు మెరుస్తాయి. ఆహారం వండేటప్పుడు పాత్రలు కాలిపోయినట్లయితే మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే నీటిలో వైట్ వెనిగర్ కలిపి శుభ్రం చేస్తే త్వరగా క్లీన్ అవుతాయి. అల్యూమినియం కుక్కర్, పాత్రలని పదే పదే వాడితే అవి పాడైపోవడమే కాకుండా మెరుపుని కోల్పోతాయి. ఇలాంటి సమయంలో వాటిని శుభ్రం చేయడానికి మీరు పాత్రను గ్యాస్‌పై ఉంచి అందులో నీరు పోయాలి.
వేడి నీటిలో రెండు టీస్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ కలపాలి. తర్వాత అందులో సగం నిమ్మకాయ రసాన్ని కలుపవచ్చు. దీంతో పాత్రలన్ని మళ్లీ కొత్త వాటిలా మెరుస్తాయి. గాజుసామాను, పింగాణీ శుభ్రం చేయడానికి కూడా వివిధ మార్గాలు ఉన్నాయి. మీరు గాజుసామానుపై మరకలను తొలగించాలనుకుంటే వెనిగర్, నీరు, డిష్ వాష్ సోప్ మిశ్రమంతో వాటిని రుద్దాలి. కానీ పాత్రలు కడగడానికి ఉపయోగించే నీరు గోరువెచ్చగా ఉండాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




