చాక్లెట్‌ కొండలు.. తినాలనుకుంటే మాత్రం..!

చాక్లెట్‌ కొండలు.. తినాలనుకుంటే మాత్రం..!
x
Highlights

చాక్లెట్ కొండలు.. కాని తినాలనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే అవి తినేవి కాదు. ఆ కొండలే పేరే 'చాక్లెట్‌ హిల్స్‌'. సాధారణంగా కొండలు ఒకదానికొకటి ఆనుకుని...

చాక్లెట్ కొండలు.. కాని తినాలనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే అవి తినేవి కాదు. ఆ కొండలే పేరే 'చాక్లెట్‌ హిల్స్‌'. సాధారణంగా కొండలు ఒకదానికొకటి ఆనుకుని ఉంటాయి. కానీ చాక్లెట్ కొండల ఆకారం వింతగా ఉంటుంది. ఈ కొండలను పై నుంచి చూస్తే ఏవో ధాన్యపు రాసుల్ని వరుసగా పోశారామే అన్నట్లు ఉంటాయి. ఇక సమ్మర్ లో అయితే పువ్వుల్ని ఒకే చోట గుట్టలుగా పోసినట్లు అనిపించేస్తుంది. 'చాక్లెట్‌ హిల్స్‌ వరల్డ్‌ మానుమెంట్‌' పేరుతో పిలిచే ఈ కొండలు ఒకదానికొకటి అంటీముట్టనట్లు భలే తమాషాగా ఉంటాయి.

ఫిలిప్పీన్స్‌ దేశంలోని బోహోల్‌ ప్రావిన్సులో ఉన్న ఈ కొండలు దాదాపుగా 50 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. ఈ కొండలపై చెట్లు పెరగ పోవటం విశేషం. అయితే లోపలున్న ఖనిజాల వల్ల వీటిపై చెట్లు పెరగవని చెబుతారు. అందుకే ఇవన్నీ చిన్న గడ్డిలాంటిదానితో కప్పి ఉంటాయి. అక్కడ అన్ని కొండలు ఏర్పడాటానికి ఓ అమ్మాయి కారణం అట. ఆ ప్రాతంలో ఉండే ఓ వ్యక్తి.. అమ్మాయిని లవ్ చేశాడట. కొంత కాలానికి ఆమె చనిపోయిందట. అందుకు ఎంతో బాధపడి ఆ వ్యక్తి గుండె పగిలేలా కన్నీళ్లు కార్చాడట. ఆ కన్నీళ్లే అక్కడ కొండల్లా మారాయని చెబుతారు. ఆ కొండల కథ నిజమో కాదో తెలియదు కానీ అక్కడ అందాల్ని చూడటానికి మాత్రం పర్యాటకులు పెద్ద సంఖ్యలో వెళ్తూంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories