Chilli Garlic Noodles: వర్షంలో కారంగా, రుచిగా ఆస్వాదించాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి

Chilli Garlic Noodles: వర్షంలో కారంగా, రుచిగా ఆస్వాదించాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి
x

Chilli Garlic Noodles: వర్షంలో కారంగా, రుచిగా ఆస్వాదించాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి

Highlights

చైనీస్ వంటకాలంటే మనందరికీ ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా నూడుల్స్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. గోధుమ, బియ్యం లేదా ఇతర పదార్థాలతో తయారయ్యే నూడుల్స్‌ను వేయించి, సూప్‌గా లేదా విభిన్న రకాల సాస్‌లతో కలిపి వండుతారు.

చైనీస్ వంటకాలంటే మనందరికీ ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా నూడుల్స్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. గోధుమ, బియ్యం లేదా ఇతర పదార్థాలతో తయారయ్యే నూడుల్స్‌ను వేయించి, సూప్‌గా లేదా విభిన్న రకాల సాస్‌లతో కలిపి వండుతారు. అందులో చిల్లీ గార్లిక్ నూడుల్స్ ఒక స్పైసీ డిలైట్‌. ఈ వర్షాకాలంలో మసాలా రుచులు ఆస్వాదించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

కావాల్సిన పదార్థాలు:

నూడుల్స్ – 200 గ్రాములు

నూనె – 2 టేబుల్ స్పూన్లు

వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి – 1 టీస్పూన్ (తరిగినవి)

ఉల్లిపాయ – ¼ కప్పు (సన్నగా కట్ చేసినవి)

క్యాప్సికమ్ – ¼ కప్పు (కట్ చేసినవి)

క్యారెట్ – ¼ కప్పు (కట్ చేసినవి)

సోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు

చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్

వెనిగర్ – 1 టీస్పూన్

చక్కెర – ½ టీస్పూన్

ఉప్పు – తగినంత

మిరియాల పొడి – 1 టీస్పూన్

తయారీ విధానం:

ముందుగా ఒక పాత్రలో నీరు మరిగించి, అందులో నూడుల్స్ వేసి 3–4 నిమిషాలు ఉడికించాలి.

అవి ఎక్కువ మెత్తబడక ముందే వడకట్టి, చల్లటి నీటితో కడిగి కొద్దిగా నూనె కలపాలి. దీంతో నూడుల్స్ అంటుకోకుండా ఉంటాయి.

ఒక పాన్‌లో నూనె వేసి వేడెక్కాక, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

తర్వాత ఉల్లిపాయలు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేపాలి.

ఇప్పుడు క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు వేసి హై ఫ్లేమ్‌లో 2 నిమిషాలు వేయించాలి.

అందులో సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, చక్కెర, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

చివరిగా ఉడికించిన నూడుల్స్ వేసి 2–3 నిమిషాలు కలుపుతూ వేయించాలి.

అంతే.. వేడి వేడిగా రుచికరమైన చిల్లీ గార్లిక్ నూడుల్స్ సిద్ధం!

సాయంత్రం వేళ ఒక కప్పు వేడి టీతో లేదా చల్లని వర్షంలో కుటుంబంతో కలిసి ఆస్వాదించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories