కాస్త కారం తింటే మంచిదంటా ..

కాస్త కారం తింటే మంచిదంటా ..
x
Highlights

కారంగా ఉన్న ఆహారాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కొంచం కారం తగలగానే కారం.. కారం.. అంటూ ఆహారాన్ని అరుస్తారు.. అయితే కారంగా ఉన్నా కూడా తినండి...

కారంగా ఉన్న ఆహారాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కొంచం కారం తగలగానే కారం.. కారం.. అంటూ ఆహారాన్ని అరుస్తారు.. అయితే కారంగా ఉన్నా కూడా తినండి అంటున్నారు.. వైద్యులు. మనం తినే ఆహారంలో కారాన్ని కొంచెం అయినా తీసుకోవాలి. ఎక్కువ మెుత్తంలో కారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కారం అనేది డైట్‌లో తప్పకుండా ఉండాలని చెప్తున్నారు నిపుణులు.

ఎండు మిర‌ప‌కాయ‌ల పొడిలో ఉండే ప‌లు ర‌కాల స‌మ్మేళ‌నాలు ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకుంటాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. కారం తిన‌డం వ‌ల్ల శరీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాల సమయంలో కారాన్ని మన డైట్‌లో చేర్చుకోవాలి. కొంచెం ఘాటుగా ఉన్నా సరే స్పైసిగా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ద‌గ్గు, జ‌లుబును లాంటివి దరి చేరకుండా ఉంటాయి. ఈ జలబు లాంటి వ్యాధులతో బాధపడుతున్నవారు కాస్త కారంతో ఆహారాన్ని తింటే త్వ‌ర‌గా ఆ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శమ‌నం పోందవచ్చు.

మిర‌ప‌కాయ‌ల్లో ఉండే క్యాప్సెయిసిన్ స‌మ్మేళ‌నం అధిక బ‌రువు త‌గ్గించ‌డంలో ఉపయోగప‌డుతుంది. అలాగే వాపుల‌ను కూడా తగ్గిస్తుంది. త‌ల‌నొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు కారం తింటే ఆయా నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే కారం తినమన్నారు కదా అని అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం తిప్పలు తప్పవు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories