Health: చూయింగ్‌ గమ్‌తో శరీరంలోకి ప్లాస్టిక్‌.. పరిశోధనల్లో సంచలన విషయాలు

Chewing Gum
x

Health: చూయింగ్‌ గమ్‌తో శరీరంలోకి ప్లాస్టిక్‌.. పరిశోధనల్లో సంచలన విషయాలు

Highlights

Chewing Gum: చూయింగ్‌ గమ్‌ను ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. చిన్నారులే కాకుండా పెద్దలు కూడా చూయింగమ్‌ను నములుతుంటారు. వీటి వల్ల పంటి ఆరోగ్యం మెరుగవడంతో పాటు ముఖానికి కూడా మంచి వ్యాయామం అవుతుందని పలువురు చెబుతుంటారు.

Chewing Gum: చూయింగ్‌ గమ్‌ను ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. చిన్నారులే కాకుండా పెద్దలు కూడా చూయింగమ్‌ను నములుతుంటారు. వీటి వల్ల పంటి ఆరోగ్యం మెరుగవడంతో పాటు ముఖానికి కూడా మంచి వ్యాయామం అవుతుందని పలువురు చెబుతుంటారు. అయితే చూయింగమ్‌ వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

బబుల్‌ గమ్‌ తినడం వల్ల నోట్లోకి మైక్రోప్లాస్టిక్స్ చేరుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త డా. సంజయ మొహంతీ తాజా అధ్యయనంలో తెలిపారు. మైక్రోప్లాస్టిక్స్ అంటే 5 మిల్లీమీటర్ల కంటే చిన్న ప్లాస్టిక్ కణాలు. ఇవి మానవ శరీరంలో ఊపిరితిత్తులు, రక్తం, మెదడులో కూడా గుర్తించినట్లు ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాజా అధ్యయనంలో 10 బబుల్ గమ్ బ్రాండ్స్‌ను పరీక్షించగా, ఒక్కో గ్రాములో సుమారు 100 నుంచి 600 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తేలింది.

సంవత్సరంలో 180 బబుల్ గమ్‌లను నమిలే వ్యక్తి శరీరంలో 30,000 మైక్రోప్లాస్టిక్ కణాలు చేరతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇవి మలం ద్వారా బయటకు వెళ్లిపోతాయని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. కాగా బబుల్ గమ్‌ తయారీలో ఉపయోగించే పదార్థాలతో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడదని సదరు కంపెనీలు సమర్థించుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే బబుల్ గమ్ వల్ల మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి వెళతాయన్నది నిజమే కానీ, అవి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకారమో ఇంకా స్పష్టత లేదు. దీనిపై మరికొన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories