Coriander: మొటిమలు, మచ్చలకు ధనియాల పొడితో చెక్

Check with Coriander Powder for Pimples and Scars
x

Coriander పొడి:(ఫైల్ ఇమేజ్)

Highlights

Coriander: ధ‌నియాలు మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తాయి.

Coriander: ప్రతి ఇంటి పోపుల పెట్టెలో వుండే సుగంధ ద్రవ్యాల్లో ఒకటి ధనియాలు. పురాతన కాలం నుండి భారతీయుల వంటకాల్లో దీనిని విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే కేవ‌లం వంట ఇంటి దినుసుగానే కాదు, ధ‌నియాలు మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తాయి. మ‌రి ధ‌నియాల‌తో మ‌నకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు క‌లుగుతాయో మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందామా..!

చాలా మంది టీనేజ్ లో మొటిమలతో, మొటిమల ద్వారా ఏర్పడే నల్లటి మచ్చలతో చాలా ఇబ్బంది పడుతూ వుంటారు. అలాంటి వారికి ధనియాల పొడి మందులా పనిచేస్తుంది. ధనియాల పొడి మరియు పసుపు లేదా ధనియాల రసంతో మిక్స్ చేసి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాన్నిపొందుతారు.

మన పూర్వీకులు జ్వరం, దగ్గు లేదా పొట్టలో అనీజీగా వుంటే ధనియాలు, మిరియాలతో చేసిన కషాయం తాగమని చెప్తుంటారు. నిజమేనండి. ధనియాలను బాగా నీటిలో మరిగించి వడకట్టుకుని ఆ కషాయం తాగడం వల్ల వెంటనే పొట్టలో అనీజీనెస్ తగ్గడంతో జలుబు, దగ్గు నుండి రిలీఫ్ పొందవచ్చు. టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడుతుందని రుజువయ్యింది.

బహిష్టు సమయంలో అధిక రక్త స్రావంతో బాధపడేవారు ఆరు గ్రాముల ధనియాలను అర లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లు వచ్చే వరకు మరిగించాలి. దీనికి పటిక బెల్లం చేర్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా మూడునాలుగు రోజులు చేస్తే మంచి ఫలిత వుంటుంది. అంతే కాదు, రుతుక్రమం క్రమంగా వచ్చేలా సహాయపడుతుంది.

ధ‌నియాల క‌షాయాన్ని తాగితే ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ధనియాల కషాయం తయారు చేసుకుని అందులో కాస్త పాలు, చక్కెర కలుపుకుని తాగడం వల్ల మంచి నిద్రపడుతుంది.శరీరంలోని కొవ్వుని కరిగించడానికి కూడా ధనియాలు బాగా ఉపయోగపడతాయి. ధనియాలను మెత్తగా పొడిలాగా చేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని దాన్ని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories