వాల్‌నట్స్‌తో మానసిక ఒత్తిడికి చెక్‌

వాల్‌నట్స్‌తో మానసిక ఒత్తిడికి చెక్‌
x
Highlights

వాల్‌నట్స్‌ తింటే మానసిక ఒత్తిడి మాయమవుతుందని ఒక అధ్యయనం చెబుతోంది. వాల్‌నట్స్‌ తినేవారు ప్రతి పనిని ఎంతో ఉత్సాహంగా చేస్తారు. కారణం వారిలో ఎక్కువ...

వాల్‌నట్స్‌ తింటే మానసిక ఒత్తిడి మాయమవుతుందని ఒక అధ్యయనం చెబుతోంది. వాల్‌నట్స్‌ తినేవారు ప్రతి పనిని ఎంతో ఉత్సాహంగా చేస్తారు. కారణం వారిలో ఎక్కువ శక్తి ఉంటుంది. అంతేకాదు ఏకాగ్రత కూడా ఎక్కువే అని తేలింది. రెగ్యులర్‌గా వాల్‌నట్స్‌ తింటే మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు తక్కువని, పని మీద ధ్యాస కూడా పెరుగుతుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

వాల్‌నట్స్‌ అసలు తిననివారితో పోల్చితే, తినేవారిలో మానసిక ఒత్తిడి 26 శాతం తక్కువగా, మిగతా నట్స్‌ తింటున్న వారిలో 8 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ నివేదిక ప్రకారం ప్రతి ఆరుగురు పెద్దవాళ్లలో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు మానసిక ఒత్తిడికి గురయ్యే ఉంటారు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. వాల్‌నట్స్‌ గుండె సంబంధ జబ్బులను తగ్గించి, మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయని గతంలో పలు అధ్యయనాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories