Prostate Cancer: సర్జరీ లేకుండానే ప్రొస్టేట్ క్యాన్సర్ కు చెక్

Prostate Cancer: సర్జరీ లేకుండానే ప్రొస్టేట్ క్యాన్సర్ కు చెక్
x
Highlights

Prostate Cancer: ప్రొస్టేట్ క్యాన్సర్ మహమ్మారి పై జరుగుతున్న పరిశోధనల్లో గొప్ప ముందడుగు పడింది. అల్ట్రా సౌండ్ చికిత్సలను ఉపయోగించడం ద్వారా సర్జరీ...

Prostate Cancer: ప్రొస్టేట్ క్యాన్సర్ మహమ్మారి పై జరుగుతున్న పరిశోధనల్లో గొప్ప ముందడుగు పడింది. అల్ట్రా సౌండ్ చికిత్సలను ఉపయోగించడం ద్వారా సర్జరీ లేకుండా ప్రొస్టేట్ క్యాన్సర్ ను సమర్ధంగా అడ్డుకోవచ్చని రైస్ వర్సిటీ, వాండరర్ బిల్డ్ వర్సిటీ పరిశోధకలు నిరూపించారు. క్యాన్సర్ చికిత్సలో వాడుతున్న ట్రైల్ కు ఆల్ట్రా సౌండ్ ను చేర్చడం ద్వారా క్యాన్సర్ కణతుల పరిమాణాన్ని తగ్గించవచ్చని వెల్లడించారు. దీనిపై అడ్వాన్స్డ్ సైన్స్ కథనం ప్రకారం ట్రైల్ లో రోగులకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి.

ఈ చికిత్సలో రోగి తీవ్రమైన అసౌకర్యానికి గురవుతాడు. ట్రైల్ కు ఎఫ్ యూఎస్ ను కూడా చేర్చినట్లయితే క్యాన్సర్ కణతుల పరిమాణం అనుకున్న విధంగా తగ్గిస్తుందని పరిశోధన తేల్చింది. ప్రొస్టేట్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్న కేసుల్లో అల్ట్రాసౌండ్ పద్ధతి చాలా బాగా పనిచేస్తుందని క్లినికల్ గా ఈ కొతత్ పద్ధతి వినియోగంలోకి వస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories