డబుల్‌ చిన్‌ కనిపించిదంటే..

డబుల్‌ చిన్‌ కనిపించిదంటే..
x
Highlights

డబుల్‌ చిన్‌' కారణంగా చాలా మంది ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. అందుకే ఈ సమస్యతో బాధపడేవారు దీని నుంచి ఎలా బయటపడాలా? తెగ ఆలోచిస్తుంటారు. చాలా మందికి...

డబుల్‌ చిన్‌' కారణంగా చాలా మంది ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. అందుకే ఈ సమస్యతో బాధపడేవారు దీని నుంచి ఎలా బయటపడాలా? తెగ ఆలోచిస్తుంటారు. చాలా మందికి జన్యుపరంగా ఇది సంక్రమిస్తుంది. డబుల్‌ చిన్‌ని తగ్గించే కొన్ని టిప్స్‌ ఉన్నాయి. అవేమిటంటే...

డబుల్‌ చిన్‌ కారణం వయసు, డైట్‌, శరీర బరువు, వ్యాయామాలు చేయకపోవడం, కావున శరీరంలోని ఇతర భాగాలకు మల్లే ఫేషియల్‌ కండరాలకు కూడా రోజు వ్యాయామం చేయాలి

ముఖ కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల ముఖంపై చర్మం బిగుతుగా మారుతుంది

ఈ సమస్య ఉన్న వారు మంచి ఆహారాన్ని తీసుకోవాలి.

గడ్డం కింద కొవ్వు వల్ల ఏర్పడే ముడతలు కనపడకుండా తరచూ స్కిన్‌ కేర్‌ పద్ధతులను అనుసరించాలి.

గడ్డం కింద భాగంలో చేరిన కొవ్వును తొలగించేందుకు పలు నాన్‌-ఇన్వేసివ్‌ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో డైట్‌, వ్యాయామాలు వంటి సింపుల్‌ టెక్నిక్స్‌ సైతం ఉన్నాయి.

డబుల్‌ చిన్‌ పరిష్కారానికి క్రియోలిపోలసిస్‌ లాంటి పాపులర్‌ ప్రొసీజర్‌ అందుబాటులో ఉన్నాయి. లేజర్‌ రిడక్షన్‌ ప్రక్రియ ద్వారా కూడా దీన్ని తగ్గించుకోవచ్చు.

అలాగే డబుల్‌ చిన్‌ పోగోట్టుకోవడానికి కొన్ని తాత్కాలిక చిట్కాలు కూడా ఉన్నాయి. ఫోటోల్లో డబుల్‌ చిన్‌ కనపడకుండా ఉండాలంటే ఎదురుగా నిలుచుని కింద నుంచి ఫోటోలు తీయకుండా పై యాంగిల్‌లోంచి తీయాలి.

ఫోటోలు తీస్తున్నప్పుడు ముఖం కొద్దిగా పైకి ఎత్తినట్టు పెడితే చర్మం కొద్దిగా టైట్‌గా మారి డబుల్‌ చిన్‌ కనపించదు.

మాట్లాడుతున్నప్పుడు ముఖం కొద్దిగా పక్కగా పెట్టి గడ్డం కింద చేయి ఉంచి మాట్లాడడం వల్ల చేయి అడ్డుగా ఉండి డబుల్‌ చిన్‌ కనపడదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories