అక్కడ మహిళలు పురుషుల ముందు చెప్పులు తీసి చేతిలో పట్టుకోవాల్సిందే!

అక్కడ మహిళలు పురుషుల ముందు చెప్పులు తీసి చేతిలో పట్టుకోవాల్సిందే!
x
Highlights

కొన్ని దశబ్దాల క్రితం దొరల ముందు వెళ్లాలంటే సామాన్య ప్రజలు బయపడేవారు. వాళ్లకు వంగి నమస్కారం చేసేవారు. కొన్ని చోట్ల అయితే దొరల ముందు వెళ్లాలంటే.....

కొన్ని దశబ్దాల క్రితం దొరల ముందు వెళ్లాలంటే సామాన్య ప్రజలు బయపడేవారు. వాళ్లకు వంగి నమస్కారం చేసేవారు. కొన్ని చోట్ల అయితే దొరల ముందు వెళ్లాలంటే.. కాళ్లకున్న చెప్పులు తీసి మరి నడిచేవారు. అయితే కాలానికి అనుగుణంగా.. సమాజంలో మార్పు వస్తుంది. కానీ ఇలాంటి ఆచారాలు ఇంకా కొన్ని చోట్ల కొనసాగడం ఆశ్చర్యం. కొన్ని ఆచారాలు చదవడానికి వింతగానే ఉన్న.. ఇవి నమ్మలేని నిజాలు. మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో ఇలాంటి వింత ఆచారం ఇంకా కొనసాగుతునే ఉంది. అక్కడ పురుషుల ముందు మహిళలు చెప్పులు విడిచి చేతిలో పట్టుకొని నడుస్తారు. చంబల్ డివిజన్‌లో అమేఠ్ అనే గ్రామంలో ఉన్న మహిళల పరిస్థితి ఇది. అక్కడ మహిళలు ఇప్పటికీ పురుషులు ఎదురైతే చాలు చెప్పులు తీసి చేతిలో పట్టుకొని ఉత్త కాళ్లతో నడుస్తారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారాన్ని అక్కడి మహిళలు పాటిస్తుండటం విశేషం.

దాదాపు 1200 జనాభా ఉన్న ఈ గ్రామంలో మహిళల సంఖ్య 500 వరకు ఉంటుంది. తెల్లవారగానే అమేఠ్ మహిళలు నీటి కోసం వాగు వద్దకు వెళతారు. ఇంటికి అవసరమయ్యే నీటి కోసమే గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న వాగు వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి. రోజుకు 7-8 గంటలు శ్రమించి అలసిపోయే మహిళలకు.. కుటుంబంలోనూ, గ్రామంలోనూ దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్నది కొందరి అభిప్రాయం.

మొదట్లో ఈ కట్టుబాటు కేవలం కొన్ని సామాజిక వర్గాల మహిళలకు మాత్రమే ఉండేది. అయితే ఆ సామాజిక వర్గం వారు అసంతృప్తి వెళ్లగక్కడం మొదలవడంతో.. ఆ ఆచారాన్ని అన్ని సామాజిక వర్గాల మహిళలకు అనివార్యం చేశారు. అమేఠ్ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఆదివాసీ పల్లెలో కూడా పురుషుల ముందు మహిళలు చెప్పులు విడిచే ఆచారం అమలులో ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories