బీపీ పేషెంట్స్‌కి ఈ స్పూన్ వరం.. ఎలా పని చేస్తుందో తెలుసా?

Japanese developed spoon for BP Patients check here for full details
x

 బీపీ పేషెంట్స్‌కి ఈ స్పూన్ వరం.. ఎలా పని చేస్తుందో తెలుసా? 

Highlights

ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో బీపీ ప్రధానమైంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు.

ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో బీపీ ప్రధానమైంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. కాగా బీపీకి ఉప్పు ప్రధాన కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ఉప్పును తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే ఉప్పు తక్కువగా ఉంటే వంటకు రుచి ఉండదని తెలిసిందే.

ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవడం ఇబ్బందిగా ఫీలయ్యే వారి కోసం జపాన్‌కు చెందిన ఓ కంపెనీ వినూత్న ఆవిష్కరణ చేసింది. లాస్‌ వేగాస్‌లో జరుగుతున్న కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షోలో ఓ కొత్త రకం స్పూన్‌ను పరిచయం చేశారు. ఈ స్పూన్‌ బీపీ పేషెంట్స్‌కి వరం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ స్పూన్‌.? ఇది ఎలా పనిచేస్తుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కిరిన్ అనే జపనీస్ కంపెనీ ఈ టెస్ట్ బర్డ్స్ స్పూన్‌ను తయారు చేసింది.

వీక్ ఎలక్ట్రిక్ వేవ్స్ ద్వారా ఈ స్పూన్ మన నాలుకకు మనం తినే ఆహారంలో ఉప్పు ఉన్నట్లుగా మనకు భావన కలిగిస్తుంది. అసలు ఉప్పు వేయని వంటకాలు కూడా ఉప్పుగా అనిపిస్తాయి. చివరికి చక్కెరను తిన్నా ఉప్పుతో తిన్న ఫీలింగ్‌ కలుగుతుంది. నాలుకపై ఉండే చాలా సెన్సిటివ్‌ నరాలను సూక్ష్మస్థాయిలో ఎలక్ట్రిక్ తరంగాలకు గురి చేయడం వల్ల ఉప్పు రుచి నాలుకకు తగులుతుంది. ఇలా మనం తీసుకునే ఆహారంలో ఉప్పు లేకున్నా ఉప్పు ఉన్నట్లుగానే రుచి ఉంటుంది.

ఈ స్పూన్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ స్పూన్‌లో మొత్తం 4 సెట్టింగ్స్‌ చేసుకోవచ్చు. ఎంత ఉప్పు భావన కలగాలి అన్నది సెట్టింగ్‌ ద్వారా మార్చుకోవచ్చు. అయితే ఎలక్ట్రిక్‌ తరంగాలు ఉంటాయని ఈ స్పూన్‌ ద్వారా షాక్‌ కొడుతుందా అన్న భయం లేదని జపాన్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ఇందుకు సంబంధించి సర్టిఫై సైతం జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈ స్పూన్‌ భారత మార్కెట్లోకి రావడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ధర విషయానికొస్తే రూ. 10 వేలుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories