Tomatoes Health Benefits: టమాట ధర తక్కువున్నప్పుడే కొనేయండి.. ఇలా చేస్తే ఎన్ని లాభాలో తెలుసా.?

Tomatoes Health Benefits: టమాట ధర తక్కువున్నప్పుడే కొనేయండి.. ఇలా చేస్తే ఎన్ని లాభాలో తెలుసా.?
x

Tomatoes Health Benefits: టమాట ధర తక్కువున్నప్పుడే కొనేయండి.. ఇలా చేస్తే ఎన్ని లాభాలో తెలుసా.?

Highlights

Tomatoes Health Benefits: టమాట ధరలు ప్రస్తుతం భారీగా పతనమయ్యాయి. కిలో టమాట కేవలం రూ. 5కే లభిస్తోంది.

Tomatoes Health Benefits: టమాట ధరలు ప్రస్తుతం భారీగా పతనమయ్యాయి. కిలో టమాట కేవలం రూ. 5కే లభిస్తోంది. అయతే ఒక్కోసారి మాత్రం కిలో టమాట ఏకంగా రూ.50కి చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే టమాట ధరలు తక్కువగా ఉన్న సమయంలో కొనుగోలు చేసి వాటిని ఇలా ఉపయోగించుకుంటే ఎన్నో బెనిఫిట్స్‌ పొందొచ్చు. ఇంతకీ టమాట ద్వారా కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టమాట రసం రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. టమోటా శరీరం నుంచి మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాల్లో టమోటాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది దాదాపు ప్రతి ఇంట్లో ప్రతిరోజూ ఉపయోగించే కూరగాయ. టమోటాతో సలాడ్, సూప్, కూరలు వంటి అనేక రకాల వంటకాలు తయారు చేయవచ్చు. కానీ టమోటా రసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫోలేట్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా, ఫైటోన్యూట్రియెంట్స్, కెరోటినాయిడ్లు శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి.

టమాట రసం వల్ల కలిగే ప్రయోజనాలు:

టమాటలో తక్కువ కేలరీలు ఉండటంతో బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో టమాట రసం తాగడం శరీరానికి మేలు చేస్తుంది. వీటిలో విటమిన్ కె, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. టమాట రసం కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో నల్ల ఉప్పు కలిపి తాగితే మరింత ప్రయోజనం పొందొచ్చు.

టమాటలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. టమాటలో లైకోపీన్, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఇంతకీ టమాట రసాన్ని ఎలా చేసుకోవాలంటే..

ముందుగా తాజా, పండిన టమాటాలను తీసుకోవాఇ. అనంతరం వాటిని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంత నీటితో కలిపి మెత్తని పేస్ట్ లా అయ్యే వరకు కలపాలి. అనంతరం రసాన్ని వడకట్టి గింజలు, గుజ్జును తొలగించాలి. రుచి కోసం కొంచెం, ఉప్పు నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories