Brown Rice Vs White Rice: శరీరానికి వైట్ రైస్ మంచిదా? బ్రౌన్ రైస్ మంచిదా? తేడా ఏంటి?

Brown Rice Vs White Rice
x

Brown Rice Vs White Rice: శరీరానికి వైట్ రైస్ మంచిదా? బ్రౌన్ రైస్ మంచిదా? తేడా ఏంటి?

Highlights

Brown Rice Vs White Rice: చాలామంది వైట్ రైస్ తినరు. బ్రౌన్ రైస్ తింటారు. మరికొంతమంది బ్రౌన్ రైస్ తినరు.. వైట్ రైస్ మాత్రమే తింటారు. ఎందుకు? అసలు ఈ వైట్ రైస్ , బ్రౌన్ రైసుల్లో తేడా ఏంటి? శరీరానికి ఏ రైస్ అయితే మంచిది? ఈ రోజు తెలుసుకుందాం.

Brown Rice Vs White Rice: చాలామంది వైట్ రైస్ తినరు. బ్రౌన్ రైస్ తింటారు. మరికొంతమంది బ్రౌన్ రైస్ తినరు.. వైట్ రైస్ మాత్రమే తింటారు. ఎందుకు? అసలు ఈ వైట్ రైస్ , బ్రౌన్ రైసుల్లో తేడా ఏంటి? శరీరానికి ఏ రైస్ అయితే మంచిది? ఈ రోజు తెలుసుకుందాం.

తెల్లని బియ్యం, గోధుమ రంగు బియ్యం.. ఈ రెండు ఒకే ధాన్యం నుండి వస్తాయి. కానీ తెల్లబియ్యం ప్రాసెసింగ్ సమయంలో ఎక్కువ దశలు తీసుకుంటుంది. అదే గోధుమ రంగు బియ్యం ప్రాసెస్ చేయడానికి తక్కువ దశలు తీసుకుంటుంది. ఈ రెండింటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కానీ ఒకదానితో ఒకటి పోలిస్తే చాలా తేడా ఉంటుంది.

వైట్ రైస్ మంచిదా?

భారతదేశంలో ప్రధాన ఆహారం.. ఈ రైస్. ఇందులో వేల రకాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్రౌన్ రైస్. ఎక్కువమంది వైట్ రైసునే తింటారు. ఎందుకంటే అది అలవాటుగా వస్తుంది. అయితే ఇందులో అసలు పోషకాలే ఉండవని కొంతమంది అనుకుంటారు. ఇందులో అసలు వాస్తవం లేదు. ఎందుకంటే వైట్ రైస్‌ పోషకాల సమృద్ది. ఈ రైస్ త్వరగా జీర్ణం అవుతుంది. అందుకే జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్లు, మినరల్స్, కొవ్వులు, ఫైబర్, కొద్ది మొత్తంలో ప్రోటీన్ ఉంటాయి. కాబట్టి శరీరానికి తెల్ల బియ్యం మంచే చేస్తాయి. కానీ చెడు చేయవు.

బ్రౌన్ రైస్ మంచిదా?

బ్రౌన్‌ రైస్‌ పోషకాలకు మూలం. ఇవి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక 100 గ్రాముల బ్రౌన్ రైస్‌లో 248 కిలో క్యాలరీలు ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్స్‌తో పాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ బ్రౌన్ రైస్‌లో ఎక్కువగా ఉంటుంది. బ్రౌన్ రైస్‌లో సుగర్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ రోగులకు బ్రౌన్ తినమని డాక్టర్లు చెబుతుంటారు. అంతేకాదు బ్రౌన్ రైస్ చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వైట్ రైస్ మంచిదా? బ్రౌన్ రైస్ మంచిదా?

శరీరానికి ఈ రెండు బియ్యం రకాలు మంచివే. అయితే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎక్కువ మంచింది. ఎందుకంటే ఈ రైస్‌ని ప్రాసెస్ చేసేటప్పుడు తక్కువగా చేస్తారు. అదే వైట్ రైస్‌లో ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. దీనివల్ల బియ్యంపై ఉండే ఫైబర్ అంతా బయటకు వెళ్లిపోతుంది. అయితే బ్రౌన్ రైస్ విషయంలో అలా ఉండదు. అందుకే దీనిలో ఎక్కువ స్థాయిలో ఫైబర్ ఉంటుంది. జీర్ణసమస్యలు ఉన్నవారు వైట్ రైస్ తినడం మంచిది. అయితే తక్కువగా తీసుకోవాలి. ఇక డయాబెటీస్, గుండె సంబందిత జబ్బులు, ఒబెసిటీ ఉన్నవారు కచ్చితంగా బ్రౌన్ రైస్ తినడం మంచిది. అయితే బ్రౌన్ రైస్ తిన్న తర్వాత జీర్ఱ సమస్యలు వస్తే డాక్టర్ సలహాతో రైస్ తినడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories