లక్షా 20 వేల సంవత్సరాల క్రితమే ఈ చిలుక..

లక్షా 20 వేల సంవత్సరాల క్రితమే ఈ చిలుక..
x
Highlights

చిట్టి చిలకమ్మా.. అమ్మ కొట్టిందా.. అంటూ చిలుకల గురించి చిన్నారులు చిలకపలుకులు పలుకుతుంటారు. అయితే చిలుక అనగానే టక్కున గుర్తుకు వచ్చేది పచ్చరంగులో...

చిట్టి చిలకమ్మా.. అమ్మ కొట్టిందా.. అంటూ చిలుకల గురించి చిన్నారులు చిలకపలుకులు పలుకుతుంటారు. అయితే చిలుక అనగానే టక్కున గుర్తుకు వచ్చేది పచ్చరంగులో ఉండే రామచిలుకలు. 'పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే.. భూలోకమే ఆనందానికి ఇల్లు' అంటూ ఓ సినీ గేయరచయిత చెప్పినట్లు.. చిలుకలు పచ్చగానే ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లో అప్పుడప్పుడు రంగురంగుల చిలుకలు దర్శనమివ్వటం మనం చూస్తుంటాం. కానీ ఎప్పుడైనా నీలిరంగు చిలుకను చూశారా.. పోనీ ఎక్కడైనా చదివారా! ఈ అరుదైన చిలుక జాతిని శాస్త్రవేత్తలు మెక్సికోలో గుర్తించారు.

ఈ నీలిరంగు చిలుకలు మన దగ్గర ఉండే పచ్చని చిలుకల కంటే పెద్దగా అరుస్తాయట. అది కూడా ఓ విచిత్రమైన సౌండ్‌తో పదే పదే అరుస్తుంటాయి. 10 నుంచి 12 చిలుకలు ఒక గుంపుగా చేరి జీవిస్తుంటాయట. ఇవి పండ్లు, పువ్వులు, ఆకులు, విత్తనాలను చాలా ఇష్టంగా తింటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటి మైటోకాండ్రియాలోని జన్యు క్రమాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు సుమారు లక్షా 20 వేల సంవత్సరాల క్రితమే ఈ జాతి ఆవిర్భవించినట్లు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories