Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? బ్లడ్‌ క్యాన్సర్‌ కావొచ్చు..

Blood Cancer Symptoms: Early Signs, Causes and Treatment Options
x

Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? బ్లడ్‌ క్యాన్సర్‌ కావొచ్చు..

Highlights

Blood Cancer Symptoms: రక్త క్యాన్సర్ అనేది రక్త కణాలను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన వ్యాధి.

Blood Cancer Symptoms: రక్త క్యాన్సర్ అనేది రక్త కణాలను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన వ్యాధి. ఇది ప్రధానంగా లుకేమియా, లింఫోమా, మైలోమా వంటి మూడు రకాలుగా విభజిస్తారు. రక్త క్యాన్సర్‌ కణాలలో DNA మార్పులు చోటుచేసుకోవడం వల్ల కణాల పని తీరులో మార్పులు వస్తాయి. యుకెలో ప్రతి సంవత్సరం 40 వేల మంది దీనికి చికిత్స పొందుతుండగా, దాదాపు 2.8 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే బ్లెడ్‌ క్యాన్సర్‌ను కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే.

దీర్ఘకాలంగా అధిక జ్వరంతో బాధపడుతున్నా, ఎలాంటి పనులు చేయకపోయినా అలసట, బలహీనతగా ఉంటున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే ఎముకలు, కీళ్ల నొప్పి,ఆకస్మిక బరువు తగ్గడం, శ్వాసలో ఇబ్బందిగా ఉండడం, రాత్రుళ్లు అకారణంగా చెమటలు పట్టడం, అనూహ్యంగా గాయాలు, రక్తస్రావం కావడం, చర్మంపై దద్దుర్లు, దురద దీర్ఘకాలంగా ఉండడం, కాలేయం ఉబ్బడం, నొప్పి వంటివి రక్త క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణాలుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

ఏ వయసులో అయినా రక్త క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇది పూర్తిగా ప్రాణాంతకమని భావించాల్సిన అవసరం లేదు. అత్యాధునిక చికిత్సలు దీని నివారణలో విప్లవాత్మక మార్పులను తెచ్చాయి. ముఖ్యంగా, లుకేమియా కీమోథెరపీ, లక్ష్య చికిత్స, ఎముక మజ్జ మార్పిడి, CAR-T సెల్ థెరపీ ద్వారా సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. రక్త క్యాన్సర్‌కు ప్రధానంగా కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యునోథెరపీ, ఎముక మజ్జ మార్పిడి వంటి చికిత్సలను అందిస్తారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రాణాలను నిలబెట్టుకోవచ్చు.

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories