Chia Seeds: న‌లుపా, తెలుపా.? చియా విత్త‌నాల్లో ఏవి తీసుకుంటే మంచిదో తెలుసా.?

Chia Seeds
x

Chia Seeds: న‌లుపా, తెలుపా.? చియా విత్త‌నాల్లో ఏవి తీసుకుంటే మంచిదో తెలుసా.?

Highlights

Chia Seeds: చియా విత్తనాలు ఇటీవల ఆరోగ్యవంతమైన ఆహారంగా చాలా మంది భావిస్తున్నారు. సూప‌ర్ ఫుడ్‌గా చెప్పే చియా సీడ్స్‌లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

Chia Seeds: చియా విత్తనాలు ఇటీవల ఆరోగ్యవంతమైన ఆహారంగా చాలా మంది భావిస్తున్నారు. సూప‌ర్ ఫుడ్‌గా చెప్పే చియా సీడ్స్‌లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా వేడి కాలంలో శరీరానికి తేమను అందించి చల్లదనాన్ని కలిగించడంలో చియా విత్తనాలు దోహదపడతాయి. వీటిని మిల్క్ షేక్స్, డెజర్ట్స్, స్మూథీస్ వంటి డ్రింక్స్‌లో కలిపి తీసుకుంటుంటారు.

చియా విత్తనాలు ప్రధానంగా నలుపు, తెలుపు రంగుల్లో లభ్యమవుతాయి. చాలామంది ఏ రంగులో వున్నవి ఆరోగ్యానికి మంచివో అనే సందేహం కలిగి ఉంటారు. రెండింటిలోనూ ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా, ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి.

నలుపు రంగు చియా విత్తనాలు కాస్త చిన్నగా ఉండగా, తెల్లవి కొంచెం పెద్దగా, మందంగా ఉంటాయి. పోషకంగా రెండూ మంచి విలువను కలిగి ఉన్నప్పటికీ, కొద్దిగా తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, క్యాల్షియం వంటి పోషకాల విషయంలో తెల్ల చియా విత్తనాలు కొంచెం మెరుగ్గా ఉంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ధర విషయంలో నలుపు విత్తనాలు కొంత తక్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి.

చియా విత్తనాలు నీటిని శరీరంలో నిల్వ చేసేందుకు సహాయపడతాయి. ఇవి దాదాపు తమ బరువుకు 12 రెట్లు ఎక్కువ నీటిని తీసుకుంటాయి. వీటిని పుడ్డింగ్‌లలో, యోగర్ట్‌లలో, బేకింగ్ ఐటమ్స్‌లో ఉపయోగించవచ్చు. మొత్తంగా చెప్పాలంటే నల్లవి, తెల్లవి రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ అధికంగా ఒమేగా 3, క్యాల్షియం అవసరమైతే తెల్ల చియా విత్తనాలు మెరుగ్గా ఉండవచ్చు. ధరలో తక్కువగా, సులభంగా లభించాలంటే నలుపు చియా విత్తనాలు బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories