ఏడ్చేందుకు ప్రత్యేకంగా క్రైయింగ్‌ క్లబ్..

ఏడ్చేందుకు ప్రత్యేకంగా క్రైయింగ్‌ క్లబ్..
x
Highlights

నవ్వడం ఒక యోగం..నవ్వకపోవడం రోగం అనే మాట చాలా మంది వినే ఉంటారు. "నవ్వు జీవితంలో పూసిన పువ్వు అని ఓ కవి చెప్పినట్లు " అది జీవితంలో అద్భుతమైనది....

నవ్వడం ఒక యోగం..నవ్వకపోవడం రోగం అనే మాట చాలా మంది వినే ఉంటారు. "నవ్వు జీవితంలో పూసిన పువ్వు అని ఓ కవి చెప్పినట్లు " అది జీవితంలో అద్భుతమైనది. సృష్టిలోని సమస్త జీవరాశిలో నవ్వగలిగిన ఏకైకజీవి మనిషి మాత్రమే. నవ్వేది ఓ క్షణ కాలమే... దాని అనుభూతి శాశ్వతం.. నవ్వు మనిషికి బలాన్నిస్తుంది...ముఖానికి కాంతినిస్తుంది... సమాజంలో శాంతినిస్తుంది.. కన్నీటిని జయిస్తుంది. నవ్వే కాదు ఇప్పుడు ఏడ్వటం కూడా ఒక యోగం.. ఏడ్వలేకపోవటం ఒక రోగం అనే మాటను కూడా జనాలు ఫాలో అవుతున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు దు:ఖాన్ని దు:ఖంతో దూరం చేయాలనే భావనను జపాన్ వాసులు పాటిస్తున్నారు. యోగ, సాంస్కృతిక కార్యక్రమానికి వచ్చినట్లు వచ్చి ఒక దగ్గరకు చేరి కలిసి ఏడుస్తూ దు:ఖ విముక్తిని చేసుకుంటున్నారు. ఆవేదనను దిగమింగుకుంటున్నారు. లాఫింగ్ క్లబ్‌లా..క్రైయింగ్‌ క్లబ్‌లను ఏర్పాటుచేసి సామూహిక ఏడ్పు కార్యక్రమాలు నిర్వహిస్తూ గుండె బరువును దూరం చేసుకుంటున్నారు. ప్రస్తుతం జర్మనీలో రుయి-కత్సుగా పేరుపొందిన ఈ సామూహిక ఏడ్పు ప్రోగాంలు ఆదరణ పొందుతున్నాయి. లాఫింగ్‌ క్లబ్బుల మాదిరిగానే వీటిని ఒకరకంగా క్రైయింగ్‌ క్లబ్‌లని అనుకోవచ్చు.

జపాన్ విన్నూత్న ఆలోచనలకు,వేడుకలకు పెట్టింది పేరు. ప్రపంచమంతా ఒకరకంగా ఆలోచిస్తే జపాన్ మరో రకంగా ఆలోచిస్తుంది. వారికి శతృవులు లేరు. ప్రకృతే వారి శతృవు. అది సృష్టించే వినాశనాన్ని తట్టుకొని ముందుకు వెళుతుంది ఈ బుల్లి దేశం. మానసిక ప్రశాంతత కోసం వారు పాటిస్తున్న రుయి-కత్సు సామూహిక ఏడ్పు కార్యక్రమమం ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఈ విధానాన్ని చాలా దేశాల్లో ఉన్న ప్రజలు కూడా ఆచరిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి బీజం వేసింది. హిరోకి టెరాయి అనే పెద్ద మనిషి. జపాన్‌లో ఓ వినూత్న సంప్రదాయం ఆచరణలో అందుబాటులో ఉంది. పెళ్లి చేసుకునేటప్పుడే కాదు.. విడాకులు తీసుకునే సమయంలోనూ వేడుకలు చేసుకుంటారు. ఈ వేడుకలను టెరయి నిర్వహిస్తాడు. దంపతులు చిట్టచివరి కలయిక కాబట్టి ఈ కార్యక్రమంలో వారి బందువులందరూ ఒక్కదగ్గరకు చేరి ఏడూస్తు వీడ్కోలు పలుకుతారు. ఈ సంఘటనలే క్రైయింగ్‌ క్లబ్‌ నాందికి కారణమయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories