Remedies for Sore Throat: గొంతులో ఇన్ఫెక్షన్ వుందా అయితే ఇవిగో టిప్స్

Natural and Effective Home Remedies for Sore Throats
x
త్రోట్ ఇన్ఫెక్షన్ టిప్స్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Home Remedies for Sore Throat: వర్షాకాలం, శీతాకాలాల్లో సాధారణంగా వచ్చే గొంతు ఇన్ఫెక్షన్ల కు చెక్ పెట్టే కొన్ని టిప్స్

Home Remedies for Sore Throat: వర్షాకాలం రయ్ రయ్ మంటూ వచ్చేస్తుంది. మరో వైపు కరోనా సెకండ్ వేపు ప్రభావం తగ్గినట్లు కనిపిస్తున్నా ఎటు వైపు నుండి కాటు వేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈ సమయంలో శరీరంలో ఎలాంటి చిన్న మార్పులు కనపడినా వెంటనే మేల్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా వర్షాకాలం, శీతాకాలాల్లో గొంతు ఇన్ఫెక్షన్లు సాధారణంగా వస్తూవుంటాయి. మనింట్లో వుండే పదార్థాలతో వాటిని ఎలా తగ్గించుకోవచ్చో మన 'లైఫ్ స్టైల్' లో చూద్దాం.

వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు ముందు గొంతులో మంట నుండే మొదలవుతాయి. ఈ కాలంలో చల్లటి పదార్థాలకు దూరంగా వుంటూ.. సాధ్యమైనంత వరకు వేడి పదార్థాలను తీసుకుంటూ శుభ్రమైన, గోరువెచ్చని నీటిని తాగుతూ వుండాలి.

ఉప్పు యాంటీ సెప్టిక్‌గా పని చేస్తుంది. ఇది ఇన్‌ఫ్లమేషన్‌, ఇన్‌ఫెక్షన్‌నీ కూడా తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు వేసి పుక్కిలి పట్టండి. ఇలా రోజులు చాలా సార్లే చేయవచ్చు.

గ్రీన్ టీ, లవంగాల టీ, అల్లం టీ వంటి టీలు ఈ సమస్యని బాగా తగ్గిస్తాయి. పెప్పర్మింట్ టీ, చామోమిల్ టీ, రాస్ప్‌బెర్రీ టీ కూడా బాగా పని చేస్తాయి. కొంత మందికి కొన్ని వస్తువుల వల్ల ఎలర్జీలు వస్తుంటాయి. వాటిని గమనించుకుంటూ హెర్బల్ టీలు తాగాలి.

చికెన్ సూప్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడే శక్తి వస్తుంది, సైనస్ మరియు నాసల్ ప్యాసేజ్ క్లియర్ అవుతాయి. అయితే, ఇందుకు ఇంట్లో చేసిన చికెన్ సూప్ మాత్రమే వాడాలి.

తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. రాత్రి నిద్రకి ముందు అర టీ స్పూన్ తేనె తీసుకుంటూ వుండాలి. అయితే సంవత్సరం లోపు పిల్లలకు మాత్రం ఇది వాడకూడదు. యాపిల్ సైడర్ వెనిర్‌తో గార్గ్లింగ్ చేయవచ్చు. యాపిల్ సిడార్ వెనిగర్‌ని ఎప్పుడు వాడినా డైల్యూట్ చేసి మాత్రమే వాడాలని గుర్తు పెట్టుకోండి.

వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసి ఆవిరి పట్టుకుంటూ వుండాలి. ఎలెక్ట్రిక్ స్టీం ఇన్‌హేలర్ లో కూడా యూకలిప్టస్ ఎస్సెన్షియల్ ఆయిల్ కలపవచ్చు. ఈ ఎస్సెన్షియల్ ఆయిల్స్‌ని డైల్యూటెడ్ ఫార్మ్‌లో మాత్రమే వాడాలి,

యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, తాజా నిమ్మకాయ, కోసి కొద్దిగా కాల్చిన నిమ్మ చెక్క వేడి నీటిలో కాసేపు ఉంచి, ఆ నీటిని తాగేయండి. గోరు వెచ్చని నీటిలో మెత్తని బట్ట ముంచి పిండేయండి. నీరు మరీ వేడిగా లేకుండా చూసుకోండి. ఈ బట్టని మెడ మీద కొన్ని నిమిషాల పాటూ ఈ బట్టని ఉంచుకోండి.

సో ఇలాంటి కొన్ని టిప్స్ ను పాటిస్తూ అవసరం అయితే డాక్టర్స్ ని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories