Tips for Oil Skin: ఆయిలీ స్కిన్ తో ఇబ్బంది పడుతున్నారా..అయితే ఇవిగో చిట్కాలు

Home Remedies and Skin Care Routine for Oil Skin Naturally
x

Tips for Oily Skin(File Image)

Highlights

Home Remedies for Oil Skin: ఆయిలీ స్కిన్ ను అధిగమించటం కష్టమే కానీ, సరైన జాగ్రత్తలు, జీవన శైలి పాటిస్తూ ఉంటే అధిగమించవచ్చు.

Home Remedies for Oil Skin: నేటి ఆధునిక కాలంలో విపరీతమైన ఒత్తిడి, శరీర తత్వానికి కావాల్సిన ఆహారం తీసుకోకపోవడం తదితర కారణాలతో చాలా మంది జిడ్డు చర్మ సమస్యతో బాధపడుతున్నారు. జిడ్డు చర్మం చాలా రకాలైన సమస్యలను తెస్తుంది. మొటిమలు, మచ్చలు వచ్చేలా చేస్తుంది. దీనికి కారణం సెబాకస్ గ్రంధులు ఎక్కువగా జిడ్డును విడుదల చేయటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుంచీ అధిగమించటం కష్టమే కానీ సరైన జాగ్రత్తలు, జీవన శైలి పాటిస్తూ ఉంటే అధిగమించవచ్చు. అవేంటో మన 'లైఫ్ స్టైల్' లో చూద్దాం.

జిడ్డు చర్మాన్ని అతిగా కడిగినా లేదా అస్సలు కడగపోయినా రెండూ ఇబ్బందికరమైనవే కాబట్టి రోజుకు రెండు సార్లు మాత్రమే కడుగుకోవటం మంచిది. ఆయిల్ స్కిన్ ను శుభ్రం చేసుకునేప్పుడు ఎప్పుడూ చాలా వరకు వేడి నీటినే వాడాలి. వేడి నీటిని వాడటం వల్ల మీ చర్మం లోని గ్రంధుల్ని వేడి నీరు ప్రభావితం అయ్యేల చేస్తుంది. దీని వల్ల ఆ జిడ్డు రాకుండా చేస్తుంది.

సిట్రిక్ లక్షణాలు కలిగిఉన్న నిమ్మరసం మీ చర్మం నుండి అదనపు జిడ్డును సమర్ధవంతంగా పీలుస్తుంది. ఒక కాటన్ బాల్ ని తాజా నిమ్మరసంలో ముంచండి, దాన్ని మీ ముఖం, మేడపై సున్నితంగా పూయండి. ఈ చిన్ని చిట్కా మీ జిడ్డు చర్మం ఆరోగ్యంగా, అందంగా తయారవడంలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది.

ముఖంపై ఎక్కువగా జుట్టు పడేలా ఉండకుండా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల అధికంగా వచ్చే జిడ్డును నివారించవచ్చు. ఆయిల్ శాతం ఎక్కువగా ఉండే షాంపూలను వాడకపోవటం ఉత్తమం. అంతేకాక తలగడదిండ్లను తరచుగా శుభ్రం చేసేలా చూడాలి. ఎందుకంటే వీటిపై ఉండే జిడ్డు పోగెట్టేటందుకు ఇలా చేయాలి.

అరకప్పు పెసరపిండిలో సరిపడా పెరుగు, కాస్త నీళ్లు కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక చల్లనినీటితో కడిగినట్లయితే జిడ్డు చర్మాన్ని తాజాగా, తేటగా మారుస్తుంది. దీని తరవాత సబ్బు రుద్దుకోకూడదు.

చల్లని లేత గోధుమ రంగు నీరు లేదా రోజ్ వాటర్ చర్మానికి రాయటం చాలా మంచిది. ఎందుకంటే వేడి నీటితో చేయటం వల్ల గ్రంధులు విచ్చుకునే ఉంటాయి. ఇలా రోజ్ వాటర్ రాయటం వల్ల అది స్కిన్ టోనర్ గా పనిచేయటమే కాక అది గ్రంధుల్ని మూసుకుపోయేలా చేసి, చర్మాన్ని కూడా బిగుతుగా చేస్తుంది. సహజసిధ్ధమైన తేయాకు నూనె చాలా మంచిది. ఈ నూనె మచ్చలపై, మొటిమలపై పని చేస్తుంది.

అర స్పూన్ బేకింగ్‌ సోడాలో కాస్త నిమ్మరసం కలపండి. మొటిమలూ, యాక్నె సమస్య ఉన్న చోట దాన్ని పూతలా రాయండి. కాసేపటి తర్వాత తడి చేతితో మర్దన చేసి ఆ పూతను తీసేయండి. దీని వల్ల నూనె గ్రంథులు మూసుకుపోయి జిడ్డు సమస్య తగ్గుతుంది.

జిడ్డు చర్మ సమస్యతో బాధపడుతున్న వారు డైయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మేలని డాక్టర్‌ సూచిస్తున్నారు. చాక్లెట్స్‌ తినడం ద్వారా జిడ్డు సమస్య వేదిస్తుంది. చాక్లెట్‌లో ఉండే చక్కెర శాతం చర్మం జిడ్డుగా మారడానికి ప్రేరేపిస్తుంది. అయితే చాక్లెట్‌ ప్రియులకు ఓ గుడ్‌న్యూస్‌.. 15రోజులకు ఒకసారి డార్క్‌ చాక్లెట్‌ తిన్నట్లయితే అంత ఇబ్బంది ఉండదని డాక్టర్‌ సూచించింది

జిడ్డు చర్మ సమస్యను నివారించాలనుకునేవారు జున్ను తదితర పదార్థాలకు దూరంగా ఉండాలని, డయిరీ పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో నూనె గ్రంథుల పరిణామం పెరిగి జిడ్డు, మొటిమల సమస్య తలెత్తుతుంది. నిత్యం మాంసాహారం భుజించడం వల్ల శరీరంలో చెడు కొవ్వు శాతం అధికమయి జిడ్డు సమస్య తెలెత్తుతుంది.

మేకప్ వేసుకునే అలవాటు వున్న చాలా జాగ్రత్తగా వుండాలి. జిడ్డు చర్యం కలిగిన వారు తేలికపాటి మేకప్ మాత్రమే వేసుకోవాలి. ముఖం కడిగిన తర్వాత మొక్కజొన్న పిండిలో నీళ్లు కలిపి ముఖానికి పూతలా రాసుకోండి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయండి. దీనివల్ల ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోతుంది. ఆ తర్వాత మేకప్‌ వేసుకున్నా ఎక్కువ సమయం నిలుస్తుంది. సో వీటన్నింటి పాటిస్తూ ఆయిలీ స్కిన్ కు చెక్ పెట్టేద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories