Top
logo

పిల్లలకు ఎలాంటి ఆహరం తినిపించాలి..

పిల్లలకు ఎలాంటి ఆహరం తినిపించాలి..
X
Highlights

పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని అందించాలో అనే ఆలోచన ప్రతి తల్లికి వస్తుంది. వారికి తల్లిదండ్రులు ఎలాంటి ఆహారం...

పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని అందించాలో అనే ఆలోచన ప్రతి తల్లికి వస్తుంది. వారికి తల్లిదండ్రులు ఎలాంటి ఆహారం అందించాలో తెలుసునేందకు కింది విషయాలను తప్పక తెలుసుకోండి. పిల్లలకు ముఖ్యంగా అమ్మపాలే అమృతం. ఎదుగుతున్న పిల్లలకు అమ్మపాలతో పాటు పాలతో తయారైన ఆహార పదార్థాలు ఇవ్వాలి. వీటిని ఆరు నెలల తర్వాత ప్రారంభించాలి. అలాగే గోధుమలు, ఓట్స్‌ బియ్యం, బార్లీ, వంటివి ఒక సంవత్సరం నుంచి అందించడం మొదలుపెట్టాలి. పెరిగే పిల్లలకు కోడిగుడ్డు, చేపలు ఇవ్వడం మంచిది. పాలు, చీజ్‌, పెరుగును తప్పకుండా పిల్లల తీసుకునే ఆహారంలో ఉండాలి. ఇవి పిల్లల ఎముకల దృఢంగా అయ్యేలా చేస్తాయి.

పిల్లల సంవత్సరం వరకు ఎదిగిన తర్వాత పప్పుతో చేసిన వంటకాలు తినిపించవచ్చు. వారానికి రెండు సార్లు చేపలు.. వారానికి ఓసారి మటన్‌ సూప్‌, చికెన్‌ సూప్‌ వంటివి అలవాటు చేస్తుండాలి. పంచదార కలపని జ్యూస్‌లతో పాటు పండ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇవ్వాలి.

ఏడాది పాటు డాక్టర్ల సలహా మేరకు పిల్లలకు ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. చనుపాలను వారికి కనీసం నాలుగు నెలలైనా ఇవ్వాలి. దీని వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఆరో నెల నుంచి బంగాళదుపం, క్యారెట్‌, ఆపిల్‌, అరటి పండ్లను ఇవ్వాలి. ఆ తర్వాత బాగా కలిపిన పప్పుతో కూడిన అన్నం, చికెన్‌ వంటివి తినిపించాలి. వారికి మాంసాహారంతో్ కూడిన ఆహారాన్ని రాత్రిపూట ఇవ్వకూడదు. రాత్రి ఎక్కవుగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి.

Next Story