Ash Gourd Benefits: బూడిద గుమ్మడి రసంతో ఎసిడిటికి చెక్

Ash Gourd Benefits in Telugu
x

ఆష్ Gourd:(ఫైల్ ఇమేజ్)

Highlights

Ash Gourd Benefits: రోజూ ఓ క‌ప్పు బూడిద గుమ్మ‌డికాయ జ్యూస్‌ను తాగితే క‌లిగే ప్ర‌యోజ‌నాలు అద్భుతం...

Ash Gourd Benefits: మన దేశంలో బూడిద గుమ్మడికి వున్న ఆదరణ ఏ దేశంలో లేదనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా పండే బూడిద గుమ్మడిని పూర్వ కాలపు వంటల్లో విరివిగా ఉపయోగించే వారు. ఈ కాలంలో ఏ దిష్టీ తగలకూడదనీ బూడిద గుమ్మడి ఇంటి ద్వారానికి కడతాం. ఈ గుమ్మడిలో ఔషధ గుణాలూ ఎన్నో ఉన్నాయి. బూడిద గుమ్మడి కాయలోనూ విత్తనాల్లోనూ తీగలోనూ కూడా ఔషధ గుణాలున్నాయని వైద్యులు అంటారు. కడుపులో గ్యాస్ నొప్పి దూరం కావాలంటే బూడిద గుమ్మ‌డి కాయ ర‌సం తాగాలి. క‌డుపులో ఉబ్బ‌రాన్ని త‌గ్గించే గుణాలు ఈ ర‌సంలో ఉన్నాయి. అంతేకాదు బ‌రువు త‌గ్గ‌డానికి దోహ‌దం చేస్తుంది. రోజూ ఓ క‌ప్పు బూడిద గుమ్మ‌డికాయ జ్యూస్‌ను తాగితే క‌లిగే ప్ర‌యోజ‌నాలను మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం…

బూడిదగుమ్మడిలో 96% ప్రధానంగా నీటితో నిండి ఉంటుంది. అంతేకాకుండా, విటమిన్ C ఇంకా నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్ వంటి B-కాంప్లెక్స్ విటమిన్లతో సహా వివిధ రకాల ప్రయోజనాలను అందించే విటమిన్స్ ఇంకా మినరల్స్ ను కలిగి ఉంటుంది. ఐరన్, పొటాషియం, జింక్, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా బూడిదగుమ్మడిలో విరివిగా లభ్యం అవుతాయి. ఇందులో మంచి మోతాదులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇంకా పీచు పదార్ధం ఉంటాయి.

  • తరచుగా పొట్టలో గ్యాస్, మంటతో బాధపడేవారు రోజూ పరగడుపున బూడిద గుమ్మడి జ్యూస్ తాగితే ఆ బాధను మనం బయటపడవచ్చు. ఒక వారం రోజుల పాటు రెగ్యులర్ గా తీసుకోవాలి.
  • దాహం ఎక్కువ‌గా ఉండ‌డం, క‌డుపులో మంట‌, ఉబ్బ‌రంగా ఉన్న‌ప్పుడు బూడిద గుమ్మ‌డికాయ చ‌క్క‌ని ఔష‌ధంలా ప‌నిచేస్తుంది. మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ‌ప‌డేవారు దీని ర‌సం తాగితే మంచి ఫ‌లితాలు క‌న‌బ‌డ‌తాయి. బూడిద గుమ్మ‌డికాయ ర‌సం తాగితే హైబీపీ త‌గ్గుతుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య‌ను కూడా దూరం చేస్తుంది.
  • కార్బొహైడ్రేట్లు, కొవ్వు అతి త‌క్కువ శాతం ఉండ‌డంతో ఇది డైట్ చేసే వారికి మంచి ఫుడ్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని ర‌సం బ‌రువు త‌గ్గ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది
  • బూడిద గుమ్మ‌డికాయ విత్త‌నాల నుంచి తీసిన నూనెను చ‌ర్మ‌వ్యాధుల నివార‌ణ‌కు వాడుతుంటారు. కాయ గింజ‌ల‌ను కొబ్బ‌రి నూనెలో మ‌రిగించి ఆ మిశ్ర‌మాన్ని త‌ల వెంట్రుల‌కు రాస్తే వెంట్రుక‌లు బాగా పెర‌గ‌డ‌మే కాకుండా జుట్టు రాలడం త‌గ్గుతుంది.
Show Full Article
Print Article
Next Story
More Stories