జుంబా డాన్స్ ఎప్పుడైనా చేశారా?

జుంబా డాన్స్ ఎప్పుడైనా చేశారా?
x
Highlights

నేటి జీవనశైలిలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్టించుకోవడానికి రకారకాలుగా వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతుంటారు.అయితే బరువు తగ్గించుకునే...

నేటి జీవనశైలిలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్టించుకోవడానికి రకారకాలుగా వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతుంటారు.

అయితే బరువు తగ్గించుకునే వివిధ రకాల వ్యాయమాలు పక్కనపెట్టి సింపుల్ గా డాన్స్ చేస్తూ శరీర బరువును తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటారా

అదే జుంబా డాన్స్ ..శరీర బరువును తగ్గించుకోవడానికి ఇప్పుడు యువత దీనికే ప్రాధాన్యతనిస్తోంది. చాలా మంది దీనిపై వైపు మొగ్గుచూపుతున్నారు.

ఏరోబిక్స్‌లా పాశ్చాత్య సంగీతంతో మేళవించి ఆడుతూ పడుతూ ఈ జుంబా డాన్స్ ను చేస్తుంటారు. దీని వల్ల శరీరానికి ఫిట్నెస్ తో పాటుగా బోలెడంత ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. శరీరానికి శ్రమ పడినట్లుగా కూడా తెలియకుండానే ఈ జుంబా డాన్స్ అనేది శరీరంలో అదనపు కాలరీస్ ను కరిగించి ఫిట్ గా ఉండేలా చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు జుంబా డ్యాన్స్ పైనే ఆసక్తి చూపుతున్నారు. అసలు ఈ జుంబా డాన్స్ వలన ఎలాంటి ఉపయోగాలున్నాయో చూద్దాం....

స్ట్రెస్ రిలీఫ్: ఒత్తిడి నుండి బయటపడేయడానికి ముఖ్యమైన సాధనాలు సంగీతం మరియు డాన్స్. ఈ రెండు జుంబా డాన్స్ ద్వారా మనం పొందవచ్చు.

సులభంగా బరువు తగ్గొచ్చు: జిమ్ కి వెళ్లి బరువులను మోసి కొవ్వు తగ్గించుకునే పద్దతి కంటే కేవలం సంగీతం వింటూ డాన్స్ తో హ్యాపీ బరువు తగ్గోచ్చు..

ఫుల్ బాడీ వర్క్ అవుట్ జుంబా డాన్స్ చేస్తున్నంత సేపు శరీరం లోని ప్రతి అణువణువు కదులుతూనే ఉంటుంది. శరీరం మొత్తాన్ని దృఢంగా తయారయ్యేలా చేస్తుంది.

గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం: జుంబా డాన్స్ తో నిగనిగలాడే చర్మం మీ సొంతం. జుంబా డాన్స్ చేస్తున్నంతసేపు శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంటుంది

దీనివల్ల బ్యాడ్ టాక్సిన్లు చెమట ద్వారా బయటకు వస్తుంటాయి కాబట్టి స్కిన్ డామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే చర్మం మెరుస్తుంది.

గుండె పనితీరు మెరుగవుతుంది: జుంబా డాన్స్ తో హార్ట్ కు కూడా ఎక్సర్ సైజ్ అందుతుంది. దీనివలన గుండె కండరాలు వేగవంతంగా పనిచేస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories