పొడవైన జుట్టు కోసం చిటికెడు పసుపు..!

పొడవైన జుట్టు కోసం చిటికెడు పసుపు..!
x
Highlights

టర్మరిక్ పౌడర్.. ఆరోగ్యానికి మరియు అందాని ఎంతో ప్రయోజన అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పసుపు అద్భుతమైన ఔషదం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గాయలను నయం...

టర్మరిక్ పౌడర్.. ఆరోగ్యానికి మరియు అందాని ఎంతో ప్రయోజన అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పసుపు అద్భుతమైన ఔషదం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గాయలను నయం చేసే.. యాంటీ సెప్టిక్ గుణాలను టర్మరిక్ పౌడర్ కలిగి ఉంటుంది. ముఖ చర్మం మరియు శరీరంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించే మంచి ఔషదంగా పసుపు పనిచేస్తుంది. అలాగే పసుపు వలన జుట్టుకు వివిధ రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

చుండ్రుకి చికిత్సలా పసుపు పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పసుపు.. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి చుండ్రును నివారిస్తుంది. చుండ్రు సమస్య పరిష్కారం కోసం.. కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను తీసుకొని, కొద్దిగా పసుపును కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. ఈ పేస్ట్ ను తలపై చర్మానికి అప్లై చేసి, కొద్ది సమయం పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో జుట్టును కడిగి వేయాలి. ఈ మిశ్రమం తలపై చర్మాన్ని శుభ్రపరచటమే కాకుండా, చుండ్రును కూడా నివారించి, తలపై చర్మంలో రక్త ప్రసరణ పెంచి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అలాగే పసుపు జుట్టు రాలటాన్నికూడా నివారిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జుట్టు సంరక్షణ నియమాలలో ఈ అద్భుతమైన ఔషదాన్ని కలుపుకోవటం వలన జుట్టు రాలటం తగ్గి, వెంట్రుకల పెరుగుదల కూడా ప్రోత్సహించబడుతుంది. దీని కోసం .. పచ్చి పాలలో పసుపును కలపి ఆప్లే చేస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఒకవేళ పొడి వెంట్రుకలను కలిగి ఉంటే, ఈ మిశ్రమానికి 2 చెంచాల తేనెను కలిపే మంచి ఫలితం వస్తుంది. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు వాడటం ద్వారా పొడవైన, మెరిసే జుట్టును పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories