చర్మసౌందర్యానికి చిన్న చిట్కా..!

చర్మసౌందర్యానికి చిన్న చిట్కా..!
x
Highlights

మహిళలు అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. చర్మ సౌందర్యం కోసం మార్కెట్లో లభించే రకరకాల క్రీములు వాడేవాళ్లు ఉన్నారు. కాని తర...

మహిళలు అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. చర్మ సౌందర్యం కోసం మార్కెట్లో లభించే రకరకాల క్రీములు వాడేవాళ్లు ఉన్నారు. కాని తర తరాలుగా.. మహిళల సౌందర్య సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషించేది మాత్రం రోజ్ వాటర్‌ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజ్ వాటర్‌తో కూడిన చాట్కాలు వాడితే చాల ప్రయోజనం కల్గుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* రోజ్ వాటర్‌ని స్నానం చేసేటప్పుడు నీటిలో కలుపుకుంటే మీ మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే చర్మ వ్యాధులు నుంచి ఉపశమనం కూడా లభిస్తుందంటున్నారు.

* రోజ్ వాటర్ మీ చర్మంలో ఉన్న రంద్రాలని శుబ్రం చేసి, చర్మంలోని జిడ్డుని తీసేస్తుంది, అంతే కాకుండా నల్ల మచ్చలు, మొటిమలను దూరం చేసి, మీ ముఖం పై ఉన్న దుమ్ము, ధూళిని తొలగిస్తుంది

* ముఖంలో ఉన్న మంటపుట్టించే చర్మం, దద్దుర్లు, ముడతలు, మొటిమలు, వీటన్నిటిపై పోరాడే తత్వం కలిగి ఉండడం వల్ల, వీటి యొక్క నివారణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

* రోజ్ వాటర్‌ని ఫేష్యల్ తర్వాత ఉపయోగిస్తే.. చర్మంలోని ఓపెన్ రంధ్రాలను మూసివేసి.. కణాలని ఆరోగ్యంగా ఉంచుతుంది.. అంతే కాకుండా, దద్దుర్లూ, ఎర్రబడిన ప్రదేశాన్ని తగ్గించి.. మంచి ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు నిపుణులు.

* పడుకునే ముందు రోజ్ వాటర్‌ని రాసుకుని పడుకుంటే.. ముఖం లోని మలినాలను శుద్ది చేసి, మరుసటి రోజు ఎంతో కాంతివంతంగా మెరిసే చర్మాన్ని ఇస్తుంది.

* నిద్ర సరిగా పట్టడానికి మరియు లేచిన వెంటనే మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉండడానికి రోజ్ వాటర్ ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories