అందమైన చర్మం కోసం చందనంతో..

అందమైన చర్మం కోసం చందనంతో..
x
Highlights

అందం.. ఎక్కవ మంది ముద్దుగుమ్మలు దీనికోసం ఏమిచేయడానికైన సిద్ధపడతారు. అందాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూంటారు. అయితే అందమైన చర్మం కోసం...

అందం.. ఎక్కవ మంది ముద్దుగుమ్మలు దీనికోసం ఏమిచేయడానికైన సిద్ధపడతారు. అందాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూంటారు. అయితే అందమైన చర్మం కోసం చందనంతో కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. చందనం దీనినే గంధం అని కూడా అంటారు. ఇది చర్మన్ని ఎంతో తాజాగా, అందంగా, మరియు యవ్వనంగా ఉంచుతుంది. ముఖం పై ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలకు చందనం చక్కట పరిష్కారం అంటున్నారు నిపుణులు. ముఖం మృదువుగా మారి ఎంతో కాతివంతంగా మెరిసేలా చందనం చేస్తుంది.

* పోడిచర్మం వారు 2 టేబుల్ స్పూన్ల చందనం పోడి, పన్నీరును మ్యాష్ చేసి రెండిటిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడుకుని ఈ మిశ్రమాన్ని ముఖానికి ఆప్లె చేసుకుని 20 నిమిషాలు తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరుచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది .పన్నీరు సువాపన వలన మెదడు ఉత్తేజితమవుతుంది.

* రెండు గులాబి పువ్వుల రెమ్మలు, 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ పోడిని తీసుకుని కోద్దిగా నీరు కలిపి పేస్ట్ లాగా చేసి 5 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత ముఖానికి పట్టించి 25 నిమిషాల తర్వాత ముఖం కడుగుకుంటే ముఖం తాజాగా, కోమలంగా ఉంటుంది.

* ఒక టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ లు గంధం పొడి, మూడు టేబుల్ స్పూన్ లు తేనె తీసుకుని పేస్ట్ లా చేసుకుని ముఖం, మెడ,చేతులు కు పూసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే అందమైన చర్మం మీ సోంతం అవుతుంది.

* ఇంకా ఈ మిశ్రమాన్ని కోంచెం ఎక్కువగా తయారు చేసుకుని ఒంటికి నలుగు లా పెట్టుకుని బాగా ఆరినక నీటితో శుభ్రపరుచుకోవాలి. అయితే సబ్బుతో కాకుండా సున్నిపిండి తో కాని,పెసరపప్పు పోడి తో గాని స్నానం చేయటం మంచిది.

అందమైన చర్మం కోసం చందనంతో పైవిధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories